Movie News

తప్పు ఒప్పుకున్నా.. క్షమాపణ చెప్పని కమల్

లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా ఒక ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’కు సంబంధించి చెన్నైలో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు అతిథిగా వచ్చిన శివరాజ్ కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళ నుంచే పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం కన్నడ నాట దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ అంశం మీద స్పందించారు. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దాని మూలాల గురించి కమల్ తెలియకుండా మాట్లాడాడారని విమర్శించారు.

మరోవైపు కన్నడ సంఘాలు, రాజకీయ పార్టీల వాళ్లు కూడా కమల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. వ్యవహారం పెద్దది అవుతుండడంతో కమల్ స్పందించారు. తాను మాట్లాడింది తప్పే అన్న ఉద్దేశంతో మాట్లాడిన కమల్.. ఆ తప్పుకు క్షమాపణ మాత్రం చెప్పలేదు. తాను కన్నడిగుల గురించి ప్రేమతో మాట్లాడానన్న కమల్.. ప్రేమ క్షమాపణ చెప్పదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“నేను ప్రేమతోనే అలా మాట్లాడాను. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు. ఎంతోమంది చరిత్రకారులు భాష చరిత్ర గురించి నాకు నేర్పించారు. నేను చేసిన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. ప్రతి ఒక్కరినీ మిళితం చేసుకునే తత్వం ఈ రాష్ట్రానికి ఉంది. ఒక మేనన్ (ఎంజీఆర్) ముఖ్యమంత్రి అయ్యారు. ఒక రెడ్డి (ఒమందూరి రామస్వామి రెడ్డియార్) సీఎంగా పని చేశారు. మైసూర్ సంస్థానంలో పని చేసిన నరసింహన్ రంగచారి మనవరాలు (జయలలిత) కూడా ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నైలో నేను ఇబ్బందులు ఎదుర్కొంటే కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు, ఆశ్రయం కల్పిస్తాం అన్నారు. రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదు. నాతో సహా ఎవ్వరికీ దీని మీద మాట్లాడే అర్హత లేదు. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం’’ అని కమల్ వ్యాఖ్యానించారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

3 minutes ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

24 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

8 hours ago