బాలీవుడ్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్‌కు తెర లేచింది. అమితాబ్ బచ్చన్ ఒక సీనియర్ హీరో దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఆ హీరో అజయ్ దేవగణ్ కావడం విశేషం. అమితాబ్, అజయ్ దేవగణ్ కలిసి ఒక సినిమాలో నటించడం కొత్తేమీ కాదు.
మేజర్ సాబ్, హమ్ కిసీసే కమ్ నహీ, సత్యాగ్రహ లాంటి మల్టీస్టారర్లలో నటించారు. కానీ ఈసారి అమితాబ్‌తో కలిసి తెరను పంచుకోవడమే కాదు.. ఈ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేస్తూ, ప్రొడక్షన్ బాధ్యత కూడా నెత్తికెత్తుకున్నాడు అజయ్. ‘మే డే’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదొక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ హ్యూమన్ డ్రామా అని చెబుతున్నాడు అజయ్. ఇందులో అజయ్ పైలట్ పాత్రలో కనిపించనున్నాడట. అమితాబ్ పాత్ర గురించి ఏమీ చెప్పలేదు. మరికొందరు పేరున్న ఆర్టిస్టులు ఇందులో నటిస్తారట. డిసెంబర్లో చిత్రీకరణ మొదలు కానుంది.
అజయ్‌కి దర్శకత్వం కూడా కొత్తేమీ కాదు. అతను ఇంతకుముందు తనే ప్రధాన పాత్రలో ‘శివాయ్’ అనే సినిమా తీశాడు. అందులో ‘అఖిల్’ భామ షాయేషా సైగల్ కథానాయికగా నటించింది. ఆ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. అయినా సరే.. అజయ్ మెగా ఫోన్ పక్కన పెట్టలేదు. ఏకంగా అమితాబ్ బచ్చన్‌ను ఒప్పించి సినిమా తీయడానికి రెడీ అయ్యడు. అమితాబ్ తన దగ్గరికి వచ్చే పది కథల్లో ఒకటో రెండో మాత్రమే ఎంచుకుంటాడు.
వయసు పెరుగుతున్నా ఆయనకు డిమాండేమీ తగ్గలేదు. ఇప్పటికీ గొప్ప గొప్ప పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మన ప్రభాస్.. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో చేయబోయే సినిమాలోనూ అమితాబ్ ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. మూణ్నెల్ల కిందట కరోనా బారిన పడ్డ అమితాబ్.. కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడైన సంగతి తెలిసిందే.
This post was last modified on November 8, 2020 11:05 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……