Movie News

నాగార్జున అంత పెద్ద రిస్క్ చేస్తారా

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో నాగార్జునని విలన్ గా పరిగణిస్తున్నారనే గాసిప్ అభిమానుల్లో కొత్త డౌట్లు పుట్టిస్తోంది. ఆల్రెడీ కూలీలో నటిస్తుండగా వెంటనే అదే కాంబోలో ఇంకో సినిమా చేయడం నాగ్ కోణంలో చూసుకుంటే రిస్క్ అవుతుంది. ఎందుకంటే వందో మూవీ దగ్గరవుతున్న తరుణంలో ఇప్పటికే ఒకే ఏడాదిలో రెండు స్పెషల్ రోల్స్ చేశారు. కూలి కాకుండా కుబేరలోనూ ఆయన సోలో హీరో కాదు. ఒకదాంట్లో మామ మరొక దాంట్లో అల్లుడు టైటిల్ రోల్స్ చేస్తున్నారు. అలాంటప్పుడు జైలర్ 2లో ప్రతినాయకుడు అంటే ఫ్యాన్స్ నుంచి అంత సానుకూల స్పందన రాకపోవచ్చు. ప్రస్తుతానికిది పుకారనే చెప్పాలి.

నా సామిరంగా తర్వాత నాగ్ మళ్ళీ ఒక్కడే హీరోగా కనిపించలేదు. అభిమానుల్లో ఈ అసంతృప్తి ఉంది. కూలి, కుబేర మీద ఎంత బజ్ ఉన్నా వాళ్ళు కోరుకుంటున్నది అలా కాదు. తండేల్ తో నాగచైతన్య ఫామ్ లోకి వచ్చాడు. లెనిన్ చూస్తుంటే అఖిల్ కు మొదటి సూపర్ హిట్టు దక్కేలా ఉంది. సుమంత్ కు అనగనగా చాలా పేరు తీసుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున సైతం లైన్ లోకి వచ్చేస్తే అక్కినేని ఫ్యాన్స్ కు పండగే. జైలర్ 2లో విలన్ అంటే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చాలా వయొలెంట్ గా డిజైన్ చేసి ఉంటాడు. దానికి నాగ్ ఎంత వరకు రైట్ ఛాయస్ అనేది సులభంగా నిర్ణయించుకునేది కాదు.

అసలు కూలిలో కూడా రోలెక్స్ లాంటి క్యారెక్టరైజేషన్ వల్లే నాగ్ ఒప్పుకున్నాడనేది ఎప్పుడో బయటికొచ్చిన మ్యాటర్. దానికి తగ్గట్టే టీజర్ లో ఆయన బ్యాక్ విజువల్ బాగా వైరలయ్యింది. ఫామ్ లోకి వస్తున్న టైంలో జైలర్ 2 లాంటి వాటిలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయడం అంత సేఫ్ కాకపోవచ్చు. తమిళ దర్శకుడు కార్తీక్ తో తన వందో సినిమా ప్లానింగ్ లో నాగ్ కు బిగ్ బాస్ 9 హోస్టింగ్ బ్యాలన్స్ ఉంది. మరి ఈ జైలర్ 2 ప్రచారం ఎంతవరకు నిజమనేది తేలాల్సి ఉంది. ముందైతే జూన్ 20న కుబేరలో కింగ్ దర్శనం కానుంది. ధనుష్ హీరో అయినప్పటికీ నాగ్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. చూడాలి మరి ఎలా ఉండబోతోందో.

This post was last modified on May 28, 2025 6:29 am

Share

Recent Posts

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

54 minutes ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

2 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

2 hours ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

3 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

4 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

4 hours ago