ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేసిన తొలి సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ ఇచ్చాక తారక్ అతడితో కలిసి సినిమా చేశాడు. అంత కమిట్మెంట్ చూపించిన తారక్‌కు త్రివిక్రమ్ ఈసారి హ్యాండివ్వబోతున్నట్లుగా ఈ మధ్య రూమర్లు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించడం.. నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి హారిక హాసిని సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు ఒప్పందం కుదరడం.. ఇంతకుముందే అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వడం తెలిసిందే. కానీ ఈ మధ్య త్రివిక్రమ్ ఆలోచనలు మారిపోయాయని.. ఎన్టీఆర్ అనుకున్న సమయానికి అందుబాటులోకి వచ్చేలా లేకపోవడంతో వేరే కమిట్మెంట్లు ఇచ్చేశాడని.. తారక్‌తో ఆయన సినిమా ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది.
ఏవేవో సినిమాలు అనౌన్స్ చేస్తూ, అప్‌డేట్లు ఇస్తూ వచ్చిన హారిక హాసిని సంస్థ.. ఎన్టీఆర్ 30 గురించి మాత్రం ఏమీ స్పందించకపోవడంతో అభిమానుల్లో సందేహాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ ఈ రోజు ఆ సినిమా ఉంటుందనే సంకేతాలు ఇచ్చింది నిర్మాణ సంస్థ. శనివారం త్రివిక్రమ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ 30 సినిమా బృందం తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ మీద ఎన్టీఆర్ 30 అని హ్యాష్ ట్యాగ్ వేశారు.
అలాగే నిర్మాతలుగా రాధాకృష్ణతో పాటు కళ్యాణ్ రామ్ పేరు కూడా వేశారు. కాబట్టి అనుకున్న కాంబినేషన్లో, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్టు ఇదే అని స్పష్టం అయిపోయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా మీద పెట్టుకున్న సందేహాలన్నింటినీ పక్కన పెట్టేశారు. బహుశా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
This post was last modified on November 7, 2020 6:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…