=

24 దారిలో సూర్య విలనిజం ?

హీరో విలన్ రెండు పాత్రలు ఒకే స్టార్ హీరో చేయడం కొత్తేమి కాదు. మానవుడు దానవుడులో శోభన్ బాబు, అంతం కాదిది ఆరంభంలో కృష్ణ, సుల్తాన్ లో బాలకృష్ణ, రోబోలో రజనీకాంత్, కాష్మోరాలో కార్తీ ఇలా ఎందరో చేశారు. కానీ వీటిలో సక్సెస్ లు ఏనున్నాయో ఫెయిల్యూర్స్ కూడా అన్నే కనిపిస్తాయి. అందుకే ఇలాంటి వాటిని హీరోలు రిస్క్ గా భావిస్తారు. ఇటీవలే ప్రకటించిన ప్యాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్న విషయం ఆల్రెడీ లీకుల రూపంలో బయటికి వచ్చేసింది. ఒకటి నెగటివ్ షేడ్ ఉంటుందని స్పష్టమైన సమాచారం. ఇప్పుడు సూర్య కూడా ఈ రూటులో వెళ్ళబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ చిత్రంలో సూర్య హీరో, విలన్ రెండు రూపాల్లో దర్శనమివ్వబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా చెప్పలేదు కానీ సోర్స్ అయితే బలంగా ఉంది. గతంలో ఈ ఎక్స్ పరిమెంట్ సూర్య 24లో చేశాడు. అందులో ఆత్రేయగా తను ఇచ్చిన అద్భుతమైన పెర్ఫార్మన్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు వెంకీ అట్లూరి కూడా అలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ ని స్పెషల్ గా డిజైన్ చేశాడట. దీనికి సంబంధించిన గెటప్పులు , మ్యానరిజం ఉహించని స్థాయిలో డిఫరెంట్ గా ఉంటాయని టీమ్ సభ్యులు ఊరిస్తున్నారు.

మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జానర్ ఏంటనేది ఇంకా బయటికి రాలేదు. సార్, లక్కీ భాస్కర్ లాగే ఎనభై తొంభై దశకంలోనే ఈ కథ సాగుతుందట. తొలుత ప్రచారం జరిగినట్టు మారుతీ ఇంజిన్ కనిపెట్టిన ఇంజినీర్ కథ కాదని విశ్వసనీయ సమాచారం. కంగువా, రెట్రో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సూర్య మార్కెట్ బాగా డ్యామేజ్ లో ఉంది. ఆర్జె బాలాజీతో చేస్తున్న సినిమా కనక బ్లాక్ బస్టర్ సాధించకపోతే ఆ బాధ్యత వెంకీ అట్లూరి మీద పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచనని, సూర్య కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకునే మూవీ ఇస్తానని వెంకీ తన సన్నిహితులతో అంటున్నారు. అది జరిగితే మంచిదేగా.