పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన బేబీని హిందీ రీమేక్ చేయాలనే ప్రయత్నాలు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా లేవు. ముందు హీరోగా అనుకున్న ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ ఇటీవలే వీడియో రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ అతను చేసిన తీవ్ర వ్యాఖ్యలు దర్శకుడు సాయి రాజేష్ తోనూ విభేదాలు తీసుకొచ్చాయి. కారణాలు ఏవైనా ఇప్పుడీ ప్రాజెక్టులో బాబిల్ ఖాన్ లేడు. సీనియర్ స్టార్ గోవిందా వారసుడు యష్ వర్ధన్ అహుజాని ట్రై చేసినప్పటికీ ఇప్పుడా కుర్రాడు కూడా సుముఖంగా లేడని ముంబై టాక్.
ఈ లెక్కన బేబీ ఇప్పుడప్పుడే పట్టాలు ఎక్కకపోవచ్చని అంటున్నారు. సాయిరాజేష్ దీని కోసమే వేరే తెలుగు సినిమా చేయకుండా టీమ్ తో స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నారు. కొన్ని కీలక మార్పులను కూడా రాసుకున్నారట. హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు కానీ అదీ కొలిక్కి రావడం లేదు. భారీ ఎత్తున ఆడిషన్లు చేసినప్పటికీ వైష్ణవి చైతన్య రేంజ్ లో పెర్ఫార్మ్ చేసేవాళ్ళు దొరకడం కష్టంగా ఉందట. పోనీ ఆమెనే తీసుకుందామంటే భాష సమస్యతో పాటు ఇతరత్రా కారణాలు ఆప్షన్ గా పెట్టుకోనివ్వడం లేదని తెలిసింది. బేబీ హిందీకి ఎస్కెఎన్ తో పాటు అల్లు అరవింద్, మధు మంతెనలు నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు.
ప్రాక్టికల్ గా ఇక్కడింకో సమస్య ఉంది. బేబీ లాంటి కథలు నార్త్ లో కొత్తేమి కాదు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటివి చాలా చూశారు. కాకపోతే సాయిరాజేష్ ట్రీట్ మెంట్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి వర్కౌట్ అవ్వొచ్చనే నమ్మకంతో ముందడుగు వేశారు. తాజా రిపోర్ట్స్ చూస్తుంటే హిందీ బేబీ ఇప్పుడప్పుడే కదిలేలా లేదట. అదే నిజమైన పక్షంలో సాయి రాజేష్ మరో కొత్త కథలో తెలుగు సినిమా ఏదైనా మొదలుపెట్టడం బెటర్. ఇలాంటి ప్రూవ్ చేసుకున్న దర్శకులు సైతం రెండు మూడు సంవత్సరాల విలువైన కాలాన్ని వృథా చేసుకోవడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. చూడాలి మరి ఏ నిర్ణయం తీసుకుంటారో.
This post was last modified on May 26, 2025 12:23 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…