అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ చాలా ఆలస్యమయ్యేలా ఉండటంతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలోగా వేరే హీరోతో ఇంకో సినిమా ప్లాన్ చేసుకోవడం గురించి గత నెల నుంచే వార్తలు విరివిగా వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ తో ప్రాజెక్టు దాదాపు ఖారైనట్టుగా ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. తాజా అప్డేట్ ఏంటంటే దీని ప్రకటన ప్లస్ అఫీషియల్ లాంచ్ జూన్ 6న ఉండొచ్చట. ఆ మేరకు ముహూర్తం పెట్టారని తెలిసింది. ఇప్పటిదాకా ఈ కాంబోకు సంబంధించిన ఎలాంటి అఫీషియల్ న్యూస్ బయటికి రాలేదు. లీకులైనా సరే అవి విశ్వసనీయ వర్గాల నుంచి కావడంతో ఈ కలయిక మీద నమ్మకం కుదిరింది.
హారిక హాసిని బ్యానర్ పై రూపొందే ఈ ఎంటర్ టైనర్ కు ఆనందరావు టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ఒక సమాచారం, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తరహాలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఇది ఉంటుందట. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఫన్, ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేయబోతున్నట్టు సమాచారం. 2026 వేసవి విడుదలని టార్గెట్ చేసుకోబోతున్నట్టు తెలిసింది. ముందు సంక్రాంతి అనుకున్నారు కానీ అదే పండక్కు చిరంజీవి – వెంకటేష్ మల్టీస్టారర్ వస్తోంది కనక ఒకే టైంలో క్లాష్ కి వెంకీ ఒప్పుకోరు కాబట్టి ఆ ఛాన్స్ లేనట్టే. త్రివిక్రమ్ సైతం హడావిడిగా తీసే ఉద్దేశంలో లేరట.
ఎంత మెల్లగా తీసినా ఏడాది లోపే రిలీజ్ కావడం ఖాయం. సంగీత దర్శకుడి తమనే ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ పేరు తిరుగుతోంది కానీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ లో బిజీగా ఉన్న తను డేట్ల సర్దుబాటు గురించి చూస్తోందని వినికిడి. వెంకటేష్ తో సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో త్రివిక్రమ్ ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు వాళ్ళ కోరిక నెరవేరబోతోంది. మాటల మాంత్రికుడు చేయబోయే వినోదపు మాయాజాలంలో వెంకీ మామ రెచ్చిపోవడం ఖాయం. అదే జరిగితే సంక్రాంతికి వస్తున్నాంని మించిన బ్లాక్ బస్టర్ ని ఆశించవచ్చు. చూద్దాం.
This post was last modified on May 25, 2025 10:43 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…