మంచు కుటుంబంలో ఇప్పుడు మిగతా వాళ్లంతా ఒక వైపు ఉంటే.. మనోజ్ వేరైపోయాడు. అనివార్య పరిస్థితుల వల్ల అతను తన తండ్రి ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. తండ్రి మోహన్ బాబు సైతం కొడుకును దూరం పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. మరి మనోజ్ తల్లి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం. ఆమె మోహన్ బాబుతో కలిసి జల్‌పల్లిలోని ఇంటిలోనే ఉంటున్నారు. మరి కన్న బిడ్డ దూరమైతే ఆమె ఎంత బాధ పడుతూ ఉంటుందో అంచనా వేయొచ్చు.
మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మనోజ్‌ను కలుస్తోందా లేదా.. అన్నదీ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై మంచు మనోజ్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. మొత్తం గొడవలో తన తల్లికి దూరం కావడమే అత్యంత బాధ కలిగించే విషయమని అతను వ్యాఖ్యానించాడు. ఆమె అప్పుడప్పుడూ తన ఇంటికి వచ్చి వెళ్తున్నట్లు మనోజ్ వెల్లడించాడు. తాను వెళ్లి ఆమెను కలవడానికి మాత్రం చాలా కండిషన్లు పెట్టారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
“నేను అమ్మను ఎక్కువ మిస్ అవుతున్నా. అమ్మను కలవాలంటే చాలా కండిషన్లు పెట్టారు. అందుకు అనుమతి తీసుకోవాలి. నేను వెళ్తే ఆమె బయటికి వచ్చి కలుస్తుంది. అప్పుడప్పుడూ అమ్మ మా వద్దకు వస్తుంది. మా పాప అంటే అమ్మకు చాలా ఇష్టం. తను కూడా మమ్మల్ని చాలా మిస్ అవుతోంది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. గొడవల వల్ల అక్కను కావాలనే దూరం పెట్టాను. ఇటీవల ఆమె చేసిన టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్‌కు నేను వస్తానో రానో తనకు తెలియదు. తన కోసమే వెళ్లాను. చాలా ఎమోషనల్ అయింది. నేను ఏమైపోతానో అని అక్క భయపడింది. నేను గొడవలు వద్దనే కోరుకుంటున్నా. కూర్చుని మాట్లాడదామంటున్నా. ఇంత జరిగినా నాకు వాళ్ల మీద ప్రేమ తప్ప ద్వేషం లేదు. నా పాపను నాన్న ఎత్తుకుంటే చూడాలనుకుంటున్నా” అని మనోజ్ తెలిపాడు.
This post was last modified on May 25, 2025 5:47 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…