ఒక సినిమాలో ఎప్పుడు పాట ఉండాలి.. అది ఎలా ఉండాలి అన్నది నిర్ణయించేది దర్శకుడు. పాటకు తగ్గ సందర్భాన్ని అతను సృష్టించి సంగీత దర్శకుడికి చెబితే.. అతను అందుకు అనుగుణంగా పాట కంపోజ్ చేస్తాడు. ఐతే ‘పుష్ప-2’ సినిమా ఆల్బంలో ఆఖర్లో వచ్చి యాడ్ అయిన ‘పీలింగ్స్’ పాట విషయంలో మాత్రం క్రెడిట్ అంతా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌దేనట. సినిమాలో ఆ పాట పెట్టే అవకాశం ఎంతమాత్రం లేకపోయినా.. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌లను ఒప్పించి తానే ఆ సాంగ్ పెట్టించినట్లు దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘పుష్ప’ పెద్ద హిట్టవడంతో ‘పుష్ప-2’కు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని క్రేజ్ వచ్చిందని.. ఏ భాష వాళ్లు ఆ భాషలో పుష్ప-2ను సొంత సినిమాగా భావించారని దేవిశ్రీ అభిప్రాయపడ్డాడు. అల్లు అర్జున్ అంటే డ్యాన్సులకు ప్రసిద్ధి అని.. అలాంటి హీరోను మరింత సెలబ్రేట్ చేయడానికి తగ్గ ‘కుత్తు’ సాంగ్ (తమిళంలో మంచి ఊపున్న పాటను ఇలా పిలుస్తారు) ‘పుష్ప-2’లో ఉండాలని తాను, బన్నీ చర్చించుకున్నట్లు దేవి తెలిపాడు.
తర్వాత తనే ఐడియా ఇచ్చి ‘పీలింగ్స్’ పాటను కంపోజ్ చేస్తే సుకుమార్‌కు అది విపరీతంగా నచ్చేసిందని.. ఆయన ఆ ఉత్సాహంలో సూపర్ స్టెప్ కూడా వేశారని.. ఆ వీడియో కూడా తన దగ్గర ఉందని.. అదే స్టెప్‌ను సినిమాలో కూడా పెట్టాలని తాను సూచించానని దేవి తెలిపాడు. ఐతే ‘పుష్ప-2’ నిడివి బాగా ఎక్కువైపోయిందని.. ఎంత ఎడిట్ చేసినా 3 గంటల 20 నిమిషాల రన్ టైం వచ్చిందని.. అంత రన్ టైంలో పాట ఎలా పెట్టగలం అని సుకుమార్ వద్దు అనుకున్నా.. తర్వాత ఆ పాటను అన్ని భాషల వాళ్లూ సెలబ్రేట్ చేస్తారనే ఉద్దేశంతో ఒప్పించి సినిమాలో పెట్టించానని దేవి తెలిపాడు. అనుకున్నట్లే ఈ పాటకు మాంచి రీచ్ వచ్చిందని దేవి తెలిపాడు.
This post was last modified on May 25, 2025 5:21 pm
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…