హెడ్డింగ్ చూడగానే రెండు సంబంధం లేని విషయాలను లింక్ పెట్టారేంటి అనుకోకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. మే 30 విడుదల కాబోతున్న భైరవం మీద ప్రేక్షకుల అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. తమిళ గరుడన్ రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ మన ఆడియన్స్ ఎక్కువ చూడకపోవడంతో ఆ అడ్వాంటేజ్ తమకు ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోంది. అందులోనూ బాగా గ్యాప్ తీసుకుని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేసిన సినిమా కావడంతో మాస్ మద్దతు ఓపెనింగ్స్ కు ఉపయోగపడుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే సీతారామరాజు రూపంలో మే 30 ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది.
ఖలేజా అదే రోజు రీ రిలీజ్ అవుతోంది. అందులో మహేష్ బాబు పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు. నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడితే కేవలం ఇరవై నాలుగు గంటల్లో 60 వేలకు పైగా టికెట్లు ముందస్తుగా అమ్ముడుపోవడం కొత్త రికార్డు. వారం ముందుగానే ఇంత ట్రెండింగ్ లో వచ్చిన పాత సినిమా టాలీవుడ్ లో లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు భైరవం బుకింగ్స్ ఓపెన్ చేసినా పది వేల నెంబర్ నమోదవుతుందనే గ్యారెంటీ లేదు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మే 30 నాటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయి ఖలేజాకు ఎక్కువ స్క్రీన్లు, షోలు ఇచ్చే సిచువేషన్ రావొచ్చని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇదే కనక జరిగితే ఫస్ట్ డే భైరవంకు ఇబ్బంది తప్పదు. ఖలేజాకు ఈ రెస్పాన్స్ ఆశించిందే కానీ మరీ ఇంత భీభత్సంగా కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సాధారణ జనంలో దీన్ని థియేటర్ లో అనుభూతి చెందాలనే కోరిక బలంగా కనిపిస్తోంది. అందుకే టికెట్లు ఇంత వేగంగా అమ్ముడుపోతున్నాయి ఈ మధ్య కొన్నిసార్లు రీ రిలీజుల వల్ల కొత్త సినిమాలు ప్రభావితం చెందాయి. ఇప్పుడు ఖలేజా వల్ల అదే జరిగితే భైరవంకు టెన్షన్ తప్పదు. ఒకవేళ కంటెంట్ యూనానిమస్ గా ఉంటే మాత్రం ఆందోళన అక్కర్లేదు. మరి ఆ స్థాయిలో దర్శకుడు విజయ్ కనకమేడల మేజిక్ చేశారో లేదో ఇంకో వారం రోజుల్లో తేలనుంది.
This post was last modified on May 24, 2025 5:21 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…