మాములుగా థియేటర్ నుంచి ఓటిటికి కొత్త సినిమాలు వెళ్లడమనేది సర్వ సర్వసాధారణం. ఇది ప్రేక్షకులకు అలవాటైన వ్యవహారం. కానీ దానికి రివర్స్ లో ఓటిటి నుంచి థియేటర్ కు వెళ్తున్న ఘనత మాత్రం అనగనగా దక్కించుకుంటోంది. ఇటీవలే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. సోషల్ మీడియాలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వెల్లువెత్తింది. పలు చోట్ల ఫ్రీ ప్రీమియర్లు వేస్తే జనం హౌస్ ఫుల్ చేశారు. వైజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే పెయిడ్ షోలు వేయబోతున్నట్టు సుమంత్ ప్రకటించారు.
ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో నాని ‘వి’ని అమెజాన్ ప్రైమ్ లో కొచ్చిన కొద్దిరోజుల తర్వాత నిర్మాత దిల్ రాజు థియేటర్ రిలీజ్ చేశారు. కానీ జనం ఆదరించలేదు. కంటెంట్ మీద అప్పటికే ఉన్న నెగటివిటీ వల్ల ఆడియన్స్ లో ఆసక్తి కలగలేదు. కానీ అనగనగా హోమ్లీ ఎంటర్ టైనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవానికి అవకాశం దొరికింది. భారీ ఎత్తున కాకుండా పరిమిత స్క్రీన్లలోనే రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇదో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతుందని చెప్పాలి. ఓటిటిలో సబ్స్క్రిప్షన్ లేని వాళ్లకు ఈ ఆప్షన్ ఉపయోగపడటమే కాకుండా బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
భవిష్యత్తులో దీన్ని మరికొందరు ఫాలో అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. కాకపోతే అనగనగా లాగా యునానిమస్ టాక్ వస్తేనే ఇలాంటివి వర్కౌట్ అవుతాయి. అలా కాకుండా అన్నింటికి ట్రై చేసితే బెడిసి కొట్టే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే నలుగురు కలిసి థియేటర్ కు వెళ్లే ఖర్చుతో ఒక ఏడాది చందా ఈజీగా కట్టెయ్యొచ్చు. అలా ఆలోచిస్తే కలెక్షన్లు పెద్దగా రావు. కానీ అనగనగా టీమ్ నమ్మకం వేరే ఉంది. చూడనివాళ్ళు థియేటర్ కోస్తారనే కాన్ఫిడెన్స్ తో ఉంది. అన్నట్టు దర్శకుడు సన్నీ సంజయ్ కు ఇప్పటికే పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు అడ్వాన్సులు వస్తున్నాయట. సక్సెస్ కొడితే ఇలాగే ఉంటుంది.
This post was last modified on May 24, 2025 1:02 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…