చిన్న చిన్న క్యారెక్టర్లతో మొదలుపెట్టి.. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడిగా ఎదిగాడు విజయ్ సేతుపతి. ఓవైపు హీరోగా నటిస్తూనే.. ఇంకోవైపు క్యారెక్టర్, విలన్ రోల్స్‌తో అతను అదరగొడుతున్నాడు. సినిమాలకు సంబంధించి తన అభిప్రాయాలకు ఎంతో విలువ ఉంటుంది కూడా. అలాంటి మేటి నటుడు ఓ చిన్న తెలుగు సినిమాను ఓ ఇంటర్వ్యూలో తెగ మెచ్చేసుకున్నాడు. ఆ చిత్రమే.. కోర్ట్. నాని నిర్మాణంలో రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై ఘనవిజయం సాధించింది.
ఓ టీనేజ్ అబ్బాయి, అమ్మాయి మధ్య సాగే ప్రేమకథ.. తదనంతర పరిణామాలతో సాగే ఈ కథను చాలా గ్రిప్పింగ్‌గా నడిపించి మెప్పించాడు రామ్ జగదీష్. పెట్టుబడి మీద రెండు మూడు రెట్ల లాభాలను అందించిన ఈ సినిమాను ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో సేతుపతి కొనియాడడం విశేషం. ప్రముఖ సినిమా విశ్లేషకుడు భరద్వాజ్ రంగన్ చేసిన తమిళ ఇంటర్వ్యూలో సేతుపతి ‘కోర్ట్’ ప్రస్తావన తెచ్చాడు. ఈ మధ్య మీరు చూసిన సినిమాలు, వాటిలో నచ్చినవి ఏంటి అని భరద్వాజ్ రంగన్ అడగ్గా.. విడాముయర్చితో పాటు కోర్ట్ మూవీని ఓటీటీలో చూసినట్లు సేతుపతి తెలిపాడు.
ఇందులో ‘కోర్ట్’ తనకు చాలా నచ్చిందని సేతుపతి చెప్పాడు. దర్శకుడు ఈ సినిమాను చాలా బాగా తీశాడన్నాడు. ఇటు సేతుపతి, అటు భరద్వాజ్ ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. కళ్యాణమండపంలోని గదిలో ఏం జరిగిందో అమ్మాయి, అబ్బాయి వేర్వేరుగా చెప్పే సన్నివేశం ఈ సినిమాకు చాలా బలమని ఇద్దరూ అన్నారు. కొందరు తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఈ సీన్ క్రింజ్ అని అన్నారని.. కానీ ఈ సినిమాకు ఆ సన్నివేశమే ఆయువుపట్టు అని భరద్వాజ్ వ్యాఖ్యానించగా.. సేతుపతి కూడా ఆ అభిప్రాయంతో అంగీకరించాడు. ప్రేక్షకులు ఊహించినదానికి భిన్నంగా దర్శకుడు ఈ సన్నివేశం రాసి, తీశాడని.. ఇలాంటి సీన్ రాయడం అంత తేలిక కాదని.. చాలా కన్విన్సింగ్‌గా, గ్రిప్పింగ్‌గా క్లైమాక్స్ తీశారని సేతుపతి అభిప్రాయపడ్డాడు. ఓ చిన్న తెలుగు సినిమా గురించి సేతుపతి లాంటి నటుడు ఇలా ఓ తమిళ ఇంటర్వ్యూలో కొనియాడడం విశేషమే.
This post was last modified on May 23, 2025 4:53 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…