తెలుగు దర్శకులు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగల్లో చాలా పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపి.. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ చక్రం తిప్పిన వాళ్లే. అంతే కాక తామే గొప్ప అనుకునే బాలీవుడ్ వాళ్లకు.. తమ మాటలు, చేతలతో షాకులిచ్చి ‘డోంట్ కేర్’ అన్నట్లు సాగిపోవడం వీరికే చెల్లింది. ప్రైమ్‌లో ఉండగా వర్మ, ప్రస్తుతం వంగ.. బాలీవుడ్ జనాలు, మీడియా తమను టార్గెట్ చేసినా కాస్తయినా తొణికింది లేదు. వర్మతో పోలిస్తే వంగ ఇంకా అగ్రెసివ్ అని చెప్పాలి. తన తొలి హిందీ చిత్రం ‘కబీర్ సింగ్’, నెక్స్ట్ ఫిలిం ‘యానిమల్’ రిలీజైనపుడు బాలీవుడ్ మీడియా, పెద్దల నుంచి ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నాడు వంగ. తన సినిమాలను ఎంతగానో విమర్శించారు.
కానీ బాక్సాఫీస్ విజయంతో సమాధానం చెబుతూనే.. తన మాటలతో కూడా వారిని గట్టిగా కౌంటర్ చేశాడు సందీప్. ముఖ్యంగా ‘యానిమల్’ రిలీజైనపుడు ఘాటుగా విమర్శించిన జావెద్ అక్తర్ లాంటి లెజెండ్స్.. అతను ఇచ్చిన సమాధానాలకు బిత్తరపోయే ఉంటారు. ఈ షాకులు చాలవన్నట్లు తన సినిమాలకు ఎంచుకునే కాస్టింగ్ విషయంలోనూ సందీప్.. తన మార్కు చూపిస్తూనే ఉన్నాడు. ‘యానిమల్’కు పరిణీతి చోప్రా లాంటి స్టార్ కిడ్‌ను కథానాయికగా ఎంచుకుని కొన్ని రోజులు షూట్ కూడా చేశాక ఆమె సూటవ్వదని తీసేశాడు. సారా అలీఖాన్‌కు సైతం ఇదే అనుభవం ఎదురైంది. ఇప్పుడు దీపికకు అతను ఇచ్చిన షాక్ బాలీవుడ్ వాళ్లకు మింగుడుపడనిదే.
బాలీవుడ్లో బాగా యాటిట్యూడ్ ఉన్న హీరోయిన్లలో దీపిక ఒకరనే పేరుంది. ‘కల్కి’ సినిమాకు ఆమెను కథానాయికగా ఎంచుకున్నపుడు.. ఈ చిత్రాన్ని ప్రభాస్ సినిమా నంబర్‌తో పేర్కొన్నందుకు ఆమె అసహనం వ్యక్తం చేయడం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా షూట్ టైంలోనూ దీపిక చాలా కండిషన్లు పెట్టిందని, టీం ఇబ్బంది పడిందని వార్తలు వచ్చాయి. ‘కల్కి’ని ఆమె సరిగా ప్రమోట్ చేయలేదు కూడా. కానీ ఆ చిత్ర బృందం సైలెంట్‌గానే ఉంది. కానీ వంగ దగ్గర ఆమె ఆటలు సాగలేదు. షూట్ టైమింగ్స్, పారితోషకం.. ఇలా పలు విషయాల్లో కండిషన్లు పెట్టేసరికి చిర్రెత్తుకొచ్చి ఆమెను సినిమా నుంచి తీసేశాడు. అంతే కాక ఎందుకు ఆమెను తప్పించాల్సి వచ్చిందో మీడియాకు స్వయంగా లీక్స్ కూడా ఇచ్చాడు. ఇది దీపికకు మామూలు డ్యామేజ్ కాదు. ఈ పరిణామం చూశాక బాలీవుడ్ బిగ్గీస్ అంటే వంగకు లెక్కే లేదని.. ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీతో ఇలా ఆటలాడుకోవడం అతడికే చెల్లిందని మన వాళ్లు ఎలివేషన్లు ఇస్తున్నారు.
This post was last modified on May 22, 2025 9:18 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…