Movie News

2006లో ‘సత్యాగ్రహి‌’తో అనుకున్నది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సీనియర్ నిర్మాత ఏఎం రత్నం‌కు ఉన్న అనుబంధమే వేరు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘ఖుషి’ సాధించిన వసూళ్ల ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పుడు ఏర్పడిన అనుబంధం రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతూ ఉంది. ఐతే ‘ఖుషి’ తర్వాత మళ్లీ వీరి కలయికలో ఓ బ్లాక్ బస్టర్ చూడాలని అభిమానులు కోరుకున్నారు కానీ.. అది సాధ్యపడలేదు. తర్వాతి చిత్రం ‘బంగారం’ డిజాస్టర్ అయింది. మళ్లీ సినిమానే సాధ్యపడలేదు. ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’తో పవన్-రత్నం జోడీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జూన్ 12న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో రత్నం మాట్లాడుతూ.. పవన్‌తో తన ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఖుషి తర్వాత మేమిద్దరం కలిసి ‘బంగారం’ చేశాం. మళ్లీ సినిమా చేయాలని అనుకున్నాం. వెంటనే పవన్ కళ్యాణ్ గారి స్వీయ దర్శకత్వంలో ‘సత్యాగ్రహి’ అనౌన్స్ చేశాం. దానికి పూజ కూడా జరిగింది. సత్యాగ్రహి అనగానే మనందరికీ గాంధీ గారు చేసిన సత్యాగ్రహం గుర్తుకు వస్తుంది. కానీ పవన్ గారు నాకు చెప్పిన కాన్సెప్ట్ వేరు. ఏదైనా అన్యాయం జరిగితే ఆగ్రహించే వ్యక్తి కథ అది. సత్య ఆగ్రహి అన్నది ఆ టైటిల్ అర్థమన్నారు. అది విని ఆశ్చర్యపోయాను. అది పవన్ గారే డైరెక్ట్ చేయాల్సిన సినిమా. కానీ ఆయనకు కుదరక ఆగిపోయింది. మల్లీ చాలా ఏళ్లకు ‘వేదాళం’ రీమేక్ తీద్దామని అనుకున్నాం.

మా అబ్బాయి జ్యోతికృష్ణనే డైరెక్ట్ చేయాల్సింది. పవన్ గారు కూడా అతణ్నే సినిమా చేయమన్నారు. కానీ జ్యోతికృష్ణ ‘ఆక్సిజన్’లో బిజీగా ఉండి ఆ సినిమా చేయలేకపోయాడు. కొన్నేళ్ల తర్వాత క్రిష్ గారు ‘హరిహర వీరమల్లు’ లైన్ చెప్పారు. నా జడ్జిమెంట్‌ను నమ్మి పవన్‌ గారు ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. ఐతే సినిమా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యమైంది. రెండు కరోనాలు వచ్చి వెళ్లాయి. ఇలా లేట్ కావడంతో మా అబ్బాయి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఒక రకంగా అతను నాకు సాయం చేశాడని చెప్పొచ్చు. రేయింబవళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు. ఇది గొప్ప సినిమా అవుతుంది’’ అని రత్నం అన్నారు.

This post was last modified on May 21, 2025 10:31 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago