చాలా తక్కువ సమయంలో పెద్ద స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ అండతో గత ఏడాది అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరో అయిపోయాడు. తన తమ్ముడు హీరో కావడం ఇష్టం లేదు అంటూనే అతణ్ని బాగానే ప్రమోట్ చేశాడు విజయ్. కానీ చిన్న దేవరకొండ తొలి చిత్రం ‘దొరసాని’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ కావడం ఒక ఇబ్బందైతే.. ఆనంద్ లుక్స్ విషయంలో విపరీతంగా ట్రోలింగ్ జరగడం మరో సమస్య. ఐతే విజయ్‌కు ఉన్న పేరు వల్లో ఏమో.. ఆనంద్‌కు ఇప్పటి వరకు అవకాశాలకైతే ఢోకా లేకపోయింది.
అతను హీరోగా ఒకటికి మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి చడీచప్పుడు లేకుండా పూర్తయిపోయింది కూడా. ఆ సినిమా పేరు.. మిడిల్ క్లాస్ మెలోడీస్. భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు రూపొందించాడు. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. నిమిషం లోపు నిడివిలో ఉన్న ఈ టీజర్లో సింపుల్‌గా ఈ సినిమా కథేంటో చెప్పేశారు.
ఆంధ్రా ప్రాంతంలోని ఒక పల్లెటూరి నుంచి గుంటూరు సిటీకి వెళ్లి అక్కడ హోటల్ వ్యాపారం చేయాలని ఆశపడే కుర్రాడి కథ ఇది. అక్కడ ఎంతోమంది ఉండగా.. వాళ్ల పోటీని తట్టుకుని నిలబడ్డం కష్టం కాదని నాన్న అంటే, అమ్మ ప్రోత్సాహంతో గుంటూరుకు వెళ్లి టిఫిన్ సెంటర్ పెట్టి హీరో ఎలా ఎదిగాడన్న నేపథ్యంలో సాగే కథ ఇది. సన్నివేశాలేమీ చూపించకుండా తల్లి, తండ్రి మధ్య సంభాషణలు.. గుంటూరు సిటీ రోడ్లతో పాటు హీరోగారి ‘రాఘవ టిఫిన్ సెంటర్’ను చూపించి టీజర్‌ను ముగించారు.
టీజర్ వరకైతే ఫీల్ గుడ్ టచ్‌తో ప్రేక్షకులు కనెక్టయ్యే సినిమాలాగే కనిపిస్తోంది ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అమేజాన్ ప్రైమ్‌లో ఈ నెల 20న ఈ చిత్రం రిలీజవుతోంది. ఇందులో ఆనంద్ సరసన వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది.
This post was last modified on November 7, 2020 3:46 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…