హనుమాన్ తర్వాత తేజ సజ్జ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ మిరాయ్ ఆల్రెడీ ఒకసారి ఏప్రిల్ 18 నుంచి ఆగస్ట్ 1 కి విడుదల తేదీ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. ముంబైలో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతోంది. ఇప్పటిదాకా జరిగిన షూట్ కి ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు. చేతిలో ఉన్న మే కాకుండా, ఉన్న రెండు నెలల్లో మొత్తం ఫినిష్ చేయడం జరిగే పనిలా కనిపించడం లేదట. అందుకే మంచు విష్ణుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వదిలిన పోస్టర్, ట్వీట్ లో రిలీజ్ డేట్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అంటే వాయిదా అనే అనుమానం వస్తోంది.
ఒకవేళ అదే కనక జరిగితే ఆగస్ట్ 1 స్లాట్ ఖాళీ అవుతుంది. ఒకరకంగా మిరాయ్ కు ఇది మంచి చేసే పరిణామమే. ఎందుకంటే ఆగస్ట్ 14 వార్ 2, కూలి రెండూ వస్తున్నాయి. వాటికి అత్యధిక థియేటర్లు కేటాయించేందుకు డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడతారు. అప్పుడు ఒకవేళ మిరాయ్ కు మంచి టాక్ వచ్చినా స్క్రీన్లు బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. హనుమాన్ కి నెల రోజుల బలమైన బాక్సాఫిస్ రన్ దక్కిన విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి మిరాయ్ ఏది జరిగినా మంచే అనుకోవాలి. టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆగస్ట్ 1 ఆప్షన్ ఆన్ లో ఉన్నట్టే అనుకోవాలి.
ఈగల్ ఫేమ్ కార్తీక ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్ మీద పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పెట్టింది. దీంతో సమాంతరంగా ది రాజా సాబ్ చిత్రీకరణ జరుగుతుండటం వల్ల ఆర్థికంగా కొంత భారమయ్యిందనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది కానీ దీనికి సంబంధించి క్లారిటీ ఇంకా రాలేదు. ఫాంటసీ జానర్ లో రూపొందిన మిరాయ్ లో మంచు మనోజ్ విలనీతో పాటు వివిధ దేశాల బ్యాక్ డ్రాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. టీజర్ ఆకట్టుకుంది కానీ ఫ్యాన్స్ కళ్ళు రాబోయే ట్రైలర్ మీద ఉన్నాయి. ఒకవేళ ఆగస్ట్ 1 మిస్ చేసుకుంటే మిరాయ్ తర్వాతి ఆప్షన్ డిసెంబరే కావొచ్చు.
This post was last modified on May 20, 2025 9:40 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…