ఓటిటి వల్ల కేవలం సినిమా థియేటర్లకు మాత్రమే నష్టమనుకుంటే పొరబడ్డట్టే. ఇంతకుముందే ఓటిటి హక్కుల ఎఫెక్ట్ టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే సినిమాలపై పడింది. ఓటిటిలో ఏ సినిమా అయినా యాభై రోజుల లోపే వచ్చేస్తుంది. టీవీ ఛానల్‍లో ప్రసారం మాత్రం బాగా లేటవుతూ వుంటుంది. దీని వల్ల సాంప్రదాయ టీవీ ప్రేక్షకులు మినహా స్మార్ట్ టీవీలు, ఫోన్లు వున్న ప్రేక్షకులు ఎప్పుడో టెలివిజన్ ప్రీమియర్ కోసం ఎదురు చూడడం మానేసారు.
ఇప్పుడు ఓటిటి కంపెనీలు పెరిగిపోవడంతో కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం కీలకంగా మారింది. అందుకని టీవీ ఛానల్స్ కోసం చేసే టాక్ షోలను కూడా ఓటిటి కంపెనీలే నిర్మిస్తున్నాయి. టీవీ ఛానల్స్ కంటే ఆకర్షణీయమయిన ఆఫర్లు ఇస్తూ వుండడంతో స్టార్లు ఓటిటిల కోసం టాక్ షోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సమంత ఫస్ట్ ఎవర్ టాక్ షోను ఆహా సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో టీవీ ఛానల్స్ కి గుబులు పట్టుకుంది. నెమ్మదిగా గేమ్ షోలను కూడా ఓటిటి కంపెనీలు లాక్కుపోతే ఛానల్స్ ఇక్కట్లు పడతాయి. అందుకే తమ దగ్గర రన్ అవుతోన్న షోలకి లాంగ్ రన్ కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నట్టు తెలిసింది.
This post was last modified on November 7, 2020 4:30 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…