Movie News

తారక్ అభిమానులు హ్యాపీగా లేరు

నెలల తరబడి వేయి కళ్ళతో ఎదురు చూసిన వార్ 2 టీజర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చేసింది. విపరీతమైన అంచనాలు నెలకొనడంతో బాహుబలి, కెజిఎఫ్ రేంజ్ లో దీని గురించి ఊహించుకున్నారు. కానీ మిశ్రమ స్పందన కన్నా సోషల్ మీడియాలో నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా రావడం తారక్ అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. నిజానికి తమ హీరో బర్త్ డే కాబట్టి కేవలం యంగ్ టైగర్ విజువల్సే ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. దానికి భిన్నంగా హృతిక్ రోషన్ కి సమాన ప్రాధాన్యం ఇస్తూ కనీసం వీడియో చివర్లో విషెస్ కూడా చెప్పకపోవడాన్ని యాంటీ ఫ్యాన్స్ ఎక్స్, ఇన్స్ టాలో హైలైట్ చేస్తున్నారు.

ఎవరు ఏం చెప్పినా వార్ 2 టీజర్ పూర్తి సంతృప్తి కలిగించలేదనేది మెజారిటీ అభిప్రాయం. విఎఫెక్స్ లో హడావిడి కనిపించింది. కొన్ని విజువల్స్ లో క్వాలిటీ లోపించింది. తారక్ లుక్స్ ని సరిగా డిజైన్ చేయలేదు. తన వాయిస్ ఓవర్ తో హృతిక్ కి ఎలివేషన్ ఇప్పించడం అన్నింటి కన్నా పెద్ద మైనస్. నార్త్ ఆడియన్స్ కి ఇదంతా ఓకే అనిపించవచ్చు కానీ తెలుగు ప్రేక్షకులు చూసేది టాలీవుడ్ కోణంలో కాబట్టి ఇలాంటి ఫీడ్ బ్యాక్ చూడాల్సి వస్తోంది. ట్రైన్ నుంచి జూనియర్ దూకే సీన్ ని వినయ విధేయ రామలో రామ్ చరణ్ సన్నివేశంతో పోలుస్తున్నారంటేనే యాష్ రాజ్ బృందం చేసిన పొరపాటేంటో చెప్పొచ్చు.

ఇవి చాలదన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ ఎక్స్ ప్రెషన్లు ఇచ్చిన సీన్లనే ఎక్కువగా పొందుపరచడం డ్యామేజ్ ని మరింత పెంచింది. అసలు ఇద్దరు హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ కన్నా కియారా అద్వానీ బికినీ షాట్ గురించే మాట్లాడుకుంటున్నారంటే దర్శకుడు అయాన్ ముఖర్జీ దీనికి బాధ్యత వహించాల్సిందే. అసలు తారక్ కి ఈ వెర్షన్ చూపించారో లేదోననే అనుమానం వస్తే మీ తప్పేం లేదు. ఆగస్ట్ 14 వార్ 2 తో పాటు వస్తున్న కూలీ హైప్ విషయంలో చాలా ముందుండగా తారక్ హృతిక్ ల మల్టీస్టారర్ మీద ఇలాంటి ఒపీనియన్స్ రావడం సరికాదు. ట్రైలర్ లో వీటిని సరిచేయాల్సిన పెద్ద ఒత్తిడి దర్శకుడి మీదుంది.

This post was last modified on May 20, 2025 3:55 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

13 minutes ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

2 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

4 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

4 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

4 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

5 hours ago