హిందీలోనే కాదు తెలుగులోనూ పరిచయం అక్కర్లేని పేరు పరేష్ రావల్. మనీ, క్షణ క్షణం, శంకర్ దాదా ఎంబిబిఎస్, రిక్షావోడు, గోవిందా గోవిందా లాంటి ఎన్నో సూపర్ హిట్స్ లో మర్చిపోలేని పాత్రలు చేశారు. ఇక బాలీవుడ్ సంగతి సరేసరి. కొన్ని వందల సినిమాల్లో గొప్ప క్యారెక్టర్లతో తనదైన ముద్ర వేశారు. అలాంటి నటుడు ఒక వేషం వదులుకుంటే 25 కోట్లు చెల్లించాని లీగల్ నోటీస్ అందుకోవడం విచిత్రమేగా. కానీ ఇది నిజం. హేరాఫేరీ 3 నుంచి తప్పుకున్నందుకు గాను అంత మొత్తం కట్టాలంటూ నిర్మాణ సంస్థ కేప్ అఫ్ గుడ్ ఫిలింస్ నోటీస్ పంపినట్టుగా ముంబై మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ షాకిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే హేరాఫేరీ 3 నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి సంబంధించిన అన్ని అనుమతులను కేప్ అఫ్ గుడ్ ఫిలింస్ సంస్థ పొందింది. ముందు రెండు భాగాలకు సంబంధించిన లెక్కలు, అప్పులు తీర్చడానికి భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టింది. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో పాటు ఇతర తారాగణం ఒకే చెప్పాక అనౌన్స్ మెంట్ కోసం ఒక ప్రోమో వీడియో షూట్ చేసింది. ఇందులో పాటు పరేష్ రావల్ కూడా పాల్గొన్నారట. ఇదయ్యాక రెండు రోజులు గడవటం ఆలస్యం తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు, ఇప్పుడు ఆసక్తి లేదనే తరహాలో పరేష్ రావల్ చెప్పడం సదరు బ్యానర్ కు షాక్ ఇచ్చింది.
దర్శకుడు ప్రియదర్శన్ ఇంకా దీని గురించి స్పందించాల్సి ఉంది. ఇంత సీరియస్ గా వ్యవహారం ముదరడానికి కారణం లేకపోలేదు. పరేష్ రావల్ పోషించిన గణపత్ రావు బాబురావు ఆప్టే పాత్రను ఆయన తప్ప ఇంకెవరు పోషించినా తెరమీద తేలిపోతుంది. ఆ మాటకొస్తే ఇద్దరు హీరోల కన్నా తనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ ఈ క్యారెక్టర్ ని పూర్తిగా తీసేసి సినిమా తీస్తే ఉన్న బజ్ పోయి ఓపెనింగ్స్ రిస్క్ లో పడే ప్రమాదముంది. ఈ నోటీస్ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. అక్కడి మీడియా వర్గాలు రాజీ కుదరొచ్చని, ఒకవేళ పరేష్ బలవంతం మీద ఒప్పుకున్నా మునుపటి మేజిక్ చేయలేరేమోనని అంటున్నారు.
This post was last modified on May 20, 2025 3:19 pm
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…