జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని ఎంచుకున్నప్పుడు ఆమె ఏడాది పాటు ఏ ఇతర సినిమాలో నటించకూడదనే కండీషన్ పెట్టినట్టు గత ఏడాదే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే రుక్మిణి ఆల్రెడీ షూటింగ్ లో ఉన్నవి కాకుండా కొత్తగా ఒప్పుకున్న కమిట్ మెంట్లు కనిపించలేదు. ఇది రాజమౌళి ఫార్ములా. తన హీరో హీరోయిన్లను పక్కా కండీషన్లతో లాక్ చేసుకోవడం నిన్న ఆర్ఆర్ఆర్ దాకా చేస్తూనే వచ్చారు. నీల్ కూడా అదే పాటించారు అనుకున్నారు. కానీ మణిరత్నం కోసం ఈ నిబంధనని నీల్ పక్కనపెట్టారని లేటెస్ట్ టాక్.
దగ్ లైఫ్ తర్వాత మణిరత్నం ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్నారట. దానికి హీరోగా నవీన్ పోలిశెట్టిని ఎంచుకున్నట్టు కాస్త గట్టిగానే వినిపిస్తోంది. అధికారిక ధృవీకరణ లేదు కానీ ప్రాజెక్టు లాకైపోయిందని వినిపిస్తోంది. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని తీసుకున్నారట. అదే నిజమైతే ప్రశాంత్ నీల్ రాజీ పడినట్టే అనుకోవాలి. ప్రస్తుతం సితార బ్యానర్ లో అనగనగా ఒక రాజు చేస్తున్న నవీన్ ఒక టైంలో ఒక సినిమాని మాత్రమే సెట్స్ పై ఉంచుతున్నాడు. దీని తర్వాత ఏదనే క్లారిటీ ఇప్పటిదాకా లేదు. చూస్తుంటే ఫైనల్ గా మణిరత్నం లాంటి కల్ట్ డైరెక్టర్ లో పడటం ఖాయంగానే కనిపిస్తోంది.
వినడానికి బాగానే ఉంది కానీ ట్రెండ్ కి కాస్త దూరంగా వెళ్తున్న మణిరత్నం నవీన్ పోలిశెట్టి మీద ఎలాంటి సబ్జెక్టు రాసుకుని ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. తనలో కామెడీ టైమింగ్ వాడుకునే హాస్యం మణిరత్నం రాయలేరు. ఆ మాటకొస్తే ఇప్పటిదాకా తీయలేదు. సఖి, ఒక బంగారం లాంటి రామ్ కామ్స్ ని ఆశించవచ్చు. చూస్తుంటే అదే జరిగేలా ఉంది. దగ్ లైఫ్ సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్న మణిరత్నం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కొత్త సినిమా మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూలైలోనే మొదలుపెట్టి ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేయాలనే టార్గెట్ ఉందట. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on May 19, 2025 7:19 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…