వచ్చే ఏడాది కేవలం ఒక్క రోజు గ్యాప్ లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్, పెద్దిలు క్యాస్టింగ్ విషయంలోనూ నువ్వా నేనాని పోటీ పడుతున్నాయి. రామ్ చరణ్ కు ధీటైన విలన్ కావాలనే ఉద్దేశంతో దర్శకుడు బుచ్చిబాబు ఏరికోరి మరీ దివ్యేందు శర్మని తీసుకొచ్చాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో తన నటనతో హడలెత్తించిన ఈ వర్సటైల్ యాక్టర్ పెద్దిలో కూడా టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడని ఆల్రెడీ టాక్. ఇప్పుడు ప్యారడైజ్ కోసం శ్రీకాంత్ ఓదెల గత ఏడాది కిల్ లో క్రూరమైన హంతకుడిగా మెప్పించిన రాఘవ్ జుయెల్ ని తీసుకొచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. లుక్ టెస్ట్ పూర్తి చేసి త్వరలో ఫస్ట్ లుక్ వదులుతారట.
గతంలో తెలుగు సినిమాల ప్రతినాయకుల కోసం ముంబై నుంచి షియాజీ షిండే, అశుతోష్ రానా, ముఖేష్ ఋషి లాంటి వాళ్ళను తీసుకొచ్చి వాళ్లకు బ్రహ్మాండమైన కెరీర్ ఇచ్చారు మన దర్శకులు. ఆ బ్యాచ్ తరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త నెత్తురు అవసరమవుతోంది. అందులో భాగంగా దివ్యేందు, రాఘవ్ జుయెల్ లాంటి చాయిసులను ఎంచుకుంటున్నారు. లుక్స్ లోనే కాదు నటనతోనే భయపెట్టే ఇలాంటి వాళ్లకు టాలీవుడ్ లో సరైన హిట్ దక్కాలే కానీ ఆఫర్లు వర్షంలా కురుస్తాయి. ఎక్కువ సినిమాలకు టెంప్ట్ చేసేలా భారీ పారితోషికాలు తలుపులు తడతాయి. పెద్ది, ప్యారడైజ్ రెండూ ఆ కోవలోనే ఉన్నాయి.
ఇప్పటికైతే షూటింగ్ ప్రోగ్రెస్ పరంగా పెద్దినే ముందుంది. ముప్పై శాతం పూర్తయిపోగా కొత్త షెడ్యూల్ ని ఇటీవలే మొదలుపెట్టారు. ది ప్యారడైజ్ సెట్లలో నాని వచ్చే నెల నుంచి అడుగు పెట్టబోతున్నాడు. లేట్ అయినా పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైంకే పూర్తి చేసేలా శ్రీకాంత్ ఓదెల సర్వం సిద్ధం చేసుకుని పెట్టాడట. కాకపోతే అనిరుద్ రవిచందర్ సహకారం చాలా అవసరం. టైంకి పాటలు ఇవ్వడంతో పాటు నేపధ్య సంగీతానికి తగినంత సమయం కేటాయించాలి. వచ్చే ఏడాది మార్చ్ ఇంకా చాలా దూరంలో ఉన్నట్టు అనిపిస్తోంది కానీ ఇప్పటి మే మినహాయించి లెక్కేసుకుంటే కేవలం పది నెలలే ఉంది.
This post was last modified on May 19, 2025 6:04 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…