షూటింగ్ ప్రారంభం కాకముందే ప్రమోషన్లతో హోరెత్తిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి మెగా 157 కోసం దాచిపెట్టిన అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటికి తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి పూజ ఓపెనింగ్ రోజే లీకయ్యింది కానీ దానికి సంబంధించిన సరైన సమాచారం లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత అయోమయానికి గురయ్యారు. నిజంగా ఉన్నారా లేదా అనే దాని గురించి సరైన క్లారిటీ లేకపోయింది. ఇప్పుడూ అధికారిక ముద్ర లేదు కానీ విశ్వసనీయ వర్గాల ప్రకారం మొదటిసారి చిరంజీవి, వెంకటేష్ కాంబోని ఆన్ స్క్రీన్ మీద వచ్చే సంక్రాంతికి చూడబోతున్నాం.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం వెంకీ పాత్ర సుమారు 25 నిమిషాల పాటు ఉంటుందని తెలిసింది. సెకండాఫ్ లో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ దగ్గర ఎంట్రీ ఇస్తారని, అక్కడి నుంచి చిరుతో కలిసి చేసే ఎంటర్ టైన్మెంట్ కి థియేటర్ పైకప్పులు యెగిరిపోవడం ఖాయమని యూనిట్ నుంచి వినిపిస్తున్న అనఫీషియల్ టాక్. టాలీవుడ్ సీనియర్ స్టార్లలో బలమైన కామెడీ టైమింగ్ ఉన్న ఈ ఇద్దరూ కలిసి దానికి అనిల్ రావిపూడి పెన్ను తోడైతే నవ్వుల అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అంతే కాదు బోనస్ గా ఈ కాంబోలో ఒక మంచి ఎలివేషన్ తో కూడిన ఫైట్ ఎపిసోడ్, పాట కూడా ఉంటాయట.
సో మెగా ప్లస్ విక్టరీతో హోరెత్తిపోవడం దాదాపు ఖాయమే. ఇటీవలే నయనతార ప్రోమోతో పరిశ్రమను ఆశ్చర్యపరిచిన అనిల్ రావిపూడి ప్రమోషన్ల విషయంలో తనకు ఎవరూ సాటిరారని మరోసారి ఋజువు చేసుకున్నాడు. తన ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందంటే షూటింగ్ మొత్తం అయిపోయాక నవంబర్, డిసెంబర్ లో పబ్లిసిటీ కోసం ఎలాంటి కంటెంట్ వాడాలి, దానికి ఆన్ స్పాట్ వీడియోలు ఎప్పుడు షూట్ చేయించాలి మొదలైనవి మొత్తం రాసుకుని పెట్టుకున్నాడట. ఇతన్ని అసాధ్యుడని ఊరికే అనలేదు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన మూడు పాటలు ఆల్మోస్ట్ ఓకే అయ్యాయట. ఇంకో రెండు ఫైనల్ కావాల్సి ఉంది.
This post was last modified on May 19, 2025 4:50 pm
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…