Movie News

‘మంచు’ గొడవ చల్లారేదెప్పుడో?

సినిమాల్లో సక్సెస్‌లు అనుకున్నంత లేకపోవచ్చు కానీ… టాలీవుడ్లో చాలా అన్యోన్యంగా ఉండే కుటుంబాల్లో ఒకటిగా మంచు వారికి చాలా మంచి పేరుండేది. మంచు విష్ణు, మంచు మనోజ్ వేర్వేరు తల్లులకు పుట్టిన కొడుకులు అనే విషయం చాలామందికి తెలియనట్లుగా చాలా బలంగా ఉండేది వాళ్ల బాండింగ్. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ బద్ధ శత్రువుల్లా మారిపోవడం మంచు ఫ్యామిలీ అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా పెద్ద షాక్. వీళ్లిద్దరి మధ్య తలెత్తింది చిన్న గొడవే అని.. కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుందని అంతా అనుకున్నారు.

కానీ నెలలు గడుస్తున్నా పరిస్థితి ఏం మారలేదు. పైగా అంతకంతకూ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని రచ్చకెక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మీడియా ఇంటర్వ్యూల్లో, స్టేజ్‌ల మీద పరస్పరం కౌంటర్లు వేసుకుని.. పరోక్షంగా కుటుంబ గౌరవాన్ని తగ్గించే పరిస్థితి తలెత్తుతోంది. మొన్న మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రక్త పంచుకుని పుట్టిన వాళ్లే మన పతనాన్ని కోరుతుంటే..’’ అంటూ మనోజ్‌ను టార్గెట్ చేశాడు. ఇటీవలి పరిణామాలతో తాను హర్ట్ అయ్యాను అంటే అది చిన్న మాటే అవుతుందని విష్ణు అన్నాడు. తన తండ్రి గౌరవం గురించి మాట్లాడుతున్నపుడు విష్ణులో ఆవేదన స్పష్టంగా కనిపించింది.

విష్ణు మాటలు వింటే.. మనోజ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు. అన్నతో సఖ్యంగా ఉండొచ్చు కదా అనిపించింది.
ఇక లేటెస్ట్‌గా మనోజ్ మరింత ఎమోషనల్ అయ్యాడు. తన ఏవీ చూస్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు. స్టేజ్ మీద కూడా కళ్లలో నీళ్లతోనే మాట్లాడాడు. ఇల్లు, కార్లు తీసేసుకుని.. తనను, తన పిల్లల్ని రోడ్డు మీదికి లాగేశారంటూ ఆవేదనను వెళ్లగక్కాడు. మనోజ్ ఆవేదన కూడా అభిమానులను కరిగించింది. విష్ణు తమ్ముడితో ఇంత కఠినంగా ఉన్నాడేంటి అనుకుంటున్నారు అందరూ.

ఐతే ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అన్నది పక్కన పెడితే.. అన్నదమ్ముల గొడవ వల్ల మంచు ఫ్యామిలీ ప్రతిష్ట దెబ్బ తింటోందన్నది వాస్తవం. మామూలుగా మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసేవాళ్లు కూడా ఈ తీవ్రత చూశాక.. ఈ గొడవ వీలైనంత త్వరగా సమసిపోయి మళ్లీ ఆ కుటుంబం అన్యోన్యంగా ఉంటే బాగుండనే కోరుకుంటున్నారు. ఈ గొడవ ఎలా ఉన్నప్పటికీ.. విష్ణు, మనోజ్ ఇద్దరూ కూడా తమ తండ్రి మీద అపారమైన ప్రేమ, గౌరవ మర్యాదలను చాటుతున్న నేపథ్యంలో ఆయన కోసమైనా కలిసిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో?

This post was last modified on May 19, 2025 2:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

18 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

1 hour ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

6 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

7 hours ago