Movie News

త్రివిక్రమ్ మల్టీస్టారర్.. నమ్మొచ్చా?

‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసేది అల్లు అర్జున్ సినిమానే అని అంతా అనుకున్నారు. కెరీర్లో తొలిసారిగా ఒక భారీ ఈవెంట్ ఫిలిం, అది కూడా పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేసుకున్నాడు. ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటి అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప-2’ తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించకుండా అట్లీ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. అలా అని త్రివిక్రమ్ సినిమా ఆగిపోయినట్లేమీ కాదు. అట్లీ సినిమా తర్వాత బన్నీ కచ్చితంగా ఈ సినిమా చేస్తాడనే అంటున్నారు.

ఈ లోపు త్రివిక్రమ్ తక్కువ టైంలో ఒక సినిమా చేసేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఇటీవల జోరుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి చర్చల్లో ఉన్న విక్టరీ వెంకటేష్ సినిమాను త్రివిక్రమ్ టేకప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ రచనలో వెంకీ చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి ఎంతగా ప్రేక్షకులను అలరించాయో తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ వెంకీ నటించడానికి అమితాసక్తి చూపించాడు కానీ.. చర్చల దశను దాటి ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. ఐతే ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ.. తర్వాత ఏ కొత్త సినిమాను మొదలుపెట్టలేదు. వేరే ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ.. త్రివిక్రమ్‌ అందుబాటులోకి రావడంతో ఆ సినిమానే చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తోంది. వీరి కలయికలో సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని ఆశిస్తున్నారు. ఐతే దీనికే ఎగ్జైట్ అవుతుంటే.. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తాడనే రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా ఈ కాంబో వర్కవుట్ అయితే అదిరిపోతుంది. కానీ ఓవైపు ‘పెద్ది’తో ఫుల్ బిజీగా ఉంటూ.. ఇంకోవైపు సుకుమార్ సినిమాను కూడా చేయాల్సిన చరణ్.. మధ్యలో ఖాళీ చేసుకుని త్రివిక్రమ్-వెంకీ సినిమాలో నటిస్తాడా అన్నది ప్రశ్న. త్రివిక్రమ్‌తో చేస్తే హీరోగానే చేయాలి కానీ.. ఇలా స్పెషల్ రోల్స్ చేయడం ఏంటి అని చరణ్ ఫ్యాన్స్ కొంచెం ఫీలయ్యే ఛాన్సు కూడా ఉంది. మరి ఈ రూమర్లో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఐతే ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లు.. అసలు త్రివిక్రమ్-వెంకీ కలిసి సినిమా చేస్తారన్నదే ఇంకా కన్ఫమ్ కానపుడు చరణ్ అతిథి పాత్ర చేయడం గురించి ఇంత చర్చ ఎందుకు అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

This post was last modified on May 19, 2025 2:27 pm

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

36 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

1 hour ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

1 hour ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

2 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago