దెయ్యాలు భూతాలు లేకుండా కేవలం చావు ఎలిమెంట్ తో ఒళ్ళు గగుర్పొడిచేలా సినిమా తీయొచ్చని నిరూపించిన మూవీ ఫైనల్ డెస్టినేషన్. 2000 సంవత్సరంలో మొదలైన ఈ పరంపరలో ఇప్పటిదాకా అయిదు భాగాలు వచ్చాయి. చివరిది 2011లో రిలీజయ్యింది. పద్నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు చివరి పార్ట్ బ్లడ్ లైన్స్ పేరుతో తీసుకొచ్చారు. ఇండియాలో ముందు రోజు అర్ధరాత్రే ప్రీమియర్లు వేయడం ద్వారా మన ఆడియన్స్ మీద నిర్మాతలకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత టెర్రిఫిక్ కంటెంట్ తో వచ్చిన బ్లడ్ లైన్స్ నిజంగా బ్లడ్ బాయిలయ్యేలా ఉందో లేదో చిన్న లుక్ వేద్దాం పదండి.
1968లో స్కై వ్యూ అనే వందల అంతస్థుల పైనున్న హోటల్ ప్రారంభోత్సవంలో ప్రమాదం జరిగి ప్రతిఒక్కరు చనిపోతారని ముందే కలగన్న ఐరిస్ (గాబ్రియేల్ రోస్) అందరిని కాపాడుతుంది. అయితే తర్వాతి రోజుల్లో ఒక్కొక్కరుగా విచిత్ర పరిస్థితుల్లో దారుణంగా ప్రాణాలు కోల్పోతారు. ఆమె మాత్రం బ్రతుకుతుంది. కట్ చేస్తే వర్తమానంలో ఐరిస్ మనవరాలికి అచ్చం అదే కల మళ్ళీ వచ్చి తన ఫ్యామిలీ సైతం అదే రీతిలో బలవుతుందని గుర్తించి అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది. చావు నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పే పుస్తకం తీసుకుని వెనక్కు వస్తుంది. ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా లాభం ఉండదు. అదే అసలు స్టోరీ.
కేవలం గంటా యాభై నిముషాలు మాత్రమే ఉన్న బ్లడ్ లైన్స్ లో హత్యలు చాలా భయానకంగా చూపించారు దర్శకులు జాచ్ లిపోవ్స్కి, ఆడమ్ స్టెయిన్. ప్రారంభంలో వచ్చే స్కై వ్యూ ఎపిసోడ్, హాస్పిటల్ లో ఎంఆర్ఐ మెషీన్ చేసే మర్డర్, మునిసిపాలిటి వ్యాన్ లో అమ్మాయి చనిపోయే సీన్ కన్నార్పకుండా చూడటం కష్టం. ముందు భాగాలంత గ్రిప్పింగ్ గా అనిపించకపోయినా ఈ సిరీస్ లవర్స్ నిరాశ చెందరు. కాకపోతే రక్తాన్ని చూసి తట్టుకునే ధైర్యం ఉండాలి. చాలా చోట్ల మనకు తెలియకుండా కళ్ళు మూసుకుంటాం. అంత జుగుప్సాకర హింస ఉంటుంది. క్లైమాక్స్ జస్ట్ ఓకే. ముగింపని చెప్పారు కానీ డాక్టర్ పాత్ర ద్వారా లీడ్ అయితే వదిలారు.
This post was last modified on May 16, 2025 10:14 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…