Movie News

అనిల్ తర్వాత బాబికే ‘మెగా’ ఆఫర్

విశ్వంభర తర్వాత చిరంజీవి కమిట్ మెంట్ ఇచ్చింది అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలకే. వీళ్ళు ఇద్దరూ కాకుండా అఫీషియల్ గా ఎవరికీ ఎస్ చెప్పలేదనేది నిన్నటి దాకా వినిపించిన టాక్. ఫైనల్ గా దానికో క్లారిటీ వచ్చేసింది. కొద్దివారాల క్రితం లీకైనట్టు వాల్తేరు వీరయ్య కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ మెగాస్టార్ మరోసారి దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవలే ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రచయిత కోన వెంకట్ ఈ విషయాన్ని పంచుకోవడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నానని చెప్పడంతో సందేహాలు తీరిపోయాయి. అనిల్ రావిపూడి తర్వాత ఈ సినిమానే ఉంటుందని చూచాయగా చెప్పేశారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. అనిల్ రావిపూడి సినిమా అయ్యాక చిరంజీవికి గ్యాప్ వస్తుంది. శ్రీకాంత్ ఓదెల నాని ప్యారడైజ్ పూర్తి చేసుకుని, రిలీజ్ చూసుకుని వచ్చేలోపు 2026 మార్చ్ వచ్చేస్తుంది. ఆ తర్వాతే మెగా స్క్రిప్ట్ మీద పని మొదలుపెట్టాలి. అటుపై ఇంకో ఆరు నెలలు పట్టే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఈలోగా చిరు బాబీది సులభంగా ఫినిష్ చేయొచ్చు. బాషా ఫార్ములాలో రెగ్యులర్ గా కాకుండా కొత్త పాయింట్ ట్రై చేస్తున్నామని, అలాని ఫ్యాన్స్ నిరాశపరచకుండా, ప్రేక్షకులు చిరంజీవి నుంచి ఏమేం కోరుకుంటారో అవన్నీ ఉంటాయని కోన వెంకట్ కుండ బద్దలు కొట్టేశారు.

సో వాల్తేరు వీరయ్యని మించి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత బాబీ మీద ఉంది. బాలకృష్ణ డాకు మహారాజ్ హిట్టయినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా హ్యాండిల్ చేయలేదనే కామెంట్స్ బాబీ మీద వచ్చాయి. ముఖ్యంగా సెకండాఫ్, క్లైమాక్స్ గురించి ఎక్కువ విశ్లేషణలు జరిగాయి. అందుకే సంక్రాంతికి వస్తున్నాం పోటీని తట్టుకోలేక డాకు మహారాజ్ డీసెంట్ హిట్ గా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి బాబీ అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలి. టాక్సిక్, జన నాయగన్ నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా రూపొందవచ్చని తెలిసింది.

This post was last modified on May 16, 2025 8:16 pm

Share

Recent Posts

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

1 hour ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

2 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

11 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

11 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

11 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

15 hours ago