టాలెంట్, రూపం రెండూ ఉన్నప్పటికీ రకరకాల కారణాల వల్ల కెరీర్ ని రెగ్యులర్ గా కొనసాగించలేకపోయిన సుమంత్ ‘మళ్ళీ రావా’ నుంచి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశాడు. తర్వాత హిట్లు పెద్దగా లేకపోయినప్పటికీ సార్, సీతా రామం లాంటి వాటిలో వేసిన పాత్రలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. థియేటర్ ఫుల్ లేకపోయినా సుమంత్ మీద ప్రేక్షకులకు సదాభిప్రాయమే ఉంది. అందుకే ఓటిటి వైపు అడుగులు వేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా వచ్చిందే అనగనగా. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎమోషనల్ మూవీకి మొన్న హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్లు వేశారు.
ఓటిటిలో ఈ సినిమాకు ప్రశంసలు వస్తున్నాయి. విమర్శకులు మెచ్చుకుంటున్నారు. సున్నితమైన విద్యా వ్యవస్థలోని లోపాలను నేపథ్యంగా ఎంచుకున్న దర్శకుడు సన్నీ సంజయ్ దాన్ని తెరకెక్కించిన తీరు భావోద్వేగాలతో నిండిపోయింది. తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్ తరహా బ్యాక్ డ్రాప్ అనిపించినప్పటికీ తెలుగు నేటివిటీని తీసుకుని ఇప్పటి కార్పొరేట్ స్కూళ్లలో జరుగుతున్న పిల్లల మానసిక వ్యాపారాన్ని సునిశితంగా ఎండగట్టిన తీరు ఆకట్టుకునేలా ఉంది. బట్టికొట్టే పాఠాల కంటే కథల ద్వారా ఎదుగుదల బాగుంటుందని నమ్మే పర్సనాలిటీ డెవలప్ మెంట్ టీచర్ పాత్రలో సుమంత్ జీవించారు.
బెస్ట్ క్లాసిక్ లాంటి పెద్ద సర్టిఫికెట్లు కాదు కానీ ఎలివేషన్లు, హీరోయిజంతో నిండిపోయిన టాలీవుడ్ తెరకు అనగనగా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. నటీనటుల నుంచి రాబట్టుకున్న నటన కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. కథనం కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ ఓటిటి వాచ్ కోణంలో చూసుకుంటే ఇది పెద్ద లోపంగా అనిపించదు. ముఖ్యంగా పిల్లలను బళ్ళలో మార్కుల కోసం ఒత్తిడి చేసే తీరు, వాటి పర్యవసానాలు తల్లితండ్రులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ తరహా ప్రయత్నాలు క్రమం తప్పకుండా ఓటిటిలో అయినా వస్తూనే ఉండాలి. హిందీ, మలయాళంలో వచ్చే ఇలాంటి కాన్సెప్ట్స్ ఇప్పుడు తెలుగులో రావడం ఆహ్వానించదగినదే.
This post was last modified on May 15, 2025 7:22 pm
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…