హిట్టు ఫ్లాప్ పక్కనపెడితే శ్రీలీల డిమాండ్ మాములుగా లేదు. ఆఫర్లు క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ కార్తీక్ ఆర్యన్ మూవీ ద్వారా హిందీ తెరంగేట్రంకు రంగం సిద్ధమవుతోంది. మరికొందరు బాలీవుడ్ డైరెక్టర్లు తన డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు తమిళంలో సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న పరాశక్తిలో నటించడం ద్వారా తనలో పర్ఫార్మర్ ని కూడా చూడొచ్చని ఇన్ సైడ్ టాక్. అఖిల్ లెనిన్ తో పాటు రవితేజ మాస్ జాతర ఈ ఏడాదే థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాయి. ఇవన్నీ ఓకే కానీ జనాలు మర్చిపోయిన మరొక సినిమా రిలీజ్ కు రెడీ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇటీవలే గనుల కేసులో శిక్ష పడి జైలుకు వెళ్లిన కర్ణాటక వ్యాపారవేత్త, మాజీ ప్రజా ప్రతినిధి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా నటించిన జూనియర్ జూలై 18 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇందులో హీరోయిన్ శ్రీలీల. షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేసారో ఎవరికి తెలియనంత సైలెంట్ గా కానిచ్చేశారు. వారాహి బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మించారు. విశేషం ఏంటంటే కిరిటీ అక్కయ్యగా బొమ్మరిల్లు జెనీలియా నటించగా శాండల్ వుడ్ స్టార్ హీరో రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడం మరో ప్రధాన ఆకర్షణ.
అంతేకాదు కెమెరా బాధ్యతలు కేకే సెంథిల్ కుమార్ నిర్వహించగా స్టంట్స్ ని పీటర్ హెయిన్స్ కంపోజ్ చేశారు. ఇంత పెద్ద సెటప్ పెట్టుకుని హడావిడి లేకుండా ఇంత హఠాత్తుగా రిలీజ్ ప్రకటన ఇవ్వడం వెరైటీనే. ట్రైలర్ త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. తండ్రి జైల్లో ఉన్న టైంలో కొడుకు తెరంగేట్రం గురించి చెప్పాల్సి రావడం సినిమాను మించిన డ్రామాగా తోస్తోంది. అన్నట్టు భారీ బడ్జెట్ ఖర్చు పెట్టిన జూనియర్ ని ప్యాన్ ఇండియా భాషల్లో రెడీ చేశారు. మరి శ్రీలీలకు ఇదేమైనా సర్ప్రైజ్ హిట్ ఇస్తుందో లేక రాబిన్ హుడ్ తరహాలో షాక్ ఇస్తుందో ఇంకో రెండు నెలల్లో తేలనుంది. దీనికి దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి.
This post was last modified on May 15, 2025 3:54 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…