సినీ రంగంలోకి వచ్చే ప్రతి వారసుడూ క్లిక్ అయిపోతాడని గ్యారెంటీ ఏమీ లేదు. అయినా సరే సినీ కుటుంబాల్లో ఒక అబ్బాయి ఉన్నాడంటే అతను హీరో కావాల్సిందే అన్నట్లుగా ఉంటోంది కొన్నేళ్లుగా వ్యవహారం. ఇంతకుముందు పెద్ద హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు కానీ.. ఈ మధ్య వాళ్ల బంధుగణాల్లో అందరూ హీరోలైపోతున్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా తమ కొడుకుల్ని హీరోలుగానే చేస్తున్నారు. ఐతే వాళ్లలో నిలదొక్కుకుంటున్న వాళ్లు చాలా తక్కువమంది.
టాలీవుడ్లో మంచి పలుకుబడి ఉన్న సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సైతం తన కొడుకు విజయ్ రాజాను హీరోగానే దించాడు. కానీ అతను ఇప్పటిదాకా నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇప్పుడతను ‘జెమ్’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం సీనియర్ హీరో రవితేజ లాంచ్ చేశాడు. ఈ చిత్రం కోసం విజయ్ రాజా నగ్నావతారం ఎత్తడం విశేషం. అతను పూర్తి నగ్నంగా ఉండగా ఎర్రటి బట్ట అతణ్ని కప్పి ఉన్నట్లుగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒళ్లంతా గాయాలతో రక్తమోడుతూ కనిపిస్తున్నాడు విజయ్ రాజా. ఐతే సీరియస్ లుక్ కోసం ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ మాత్రం పేలవంగా అనిపిస్తోంది.
సుశీల సుబ్రహ్మణ్యం అనే దర్శకుదు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. కుమారస్వామి పత్తికొండ నిర్మిస్తున్నాడు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు లాంటి పేరున్న టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. విజయ్ ఇది కాక ‘వేయి శుభములు కలుగుగాక’ అని మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఐతే కొడుకు కోసం ఇప్పటిదాకా అయితే శివాజీ రాజా కాస్త పేరున్న కాంబినేషన్లు సెట్ చేయలేకపోయాడు. లుక్స్ పరంగా యావరేజ్ అనిపిస్తున్న విజయ్.. ఇలాంటి సినిమాలతో ఏమేర క్లిక్ అవుతాడో చూడాలి.
This post was last modified on November 7, 2020 12:06 pm
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…