సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్లు ఊపందుకున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇంటర్వ్యూలు వైరల్ కావడం మొదలయ్యాయి. ఇంకా సరైన టీజర్ రాకుండా కేవలం ప్రోమో వీడియోలతోనే హైప్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర మల్టీ స్టారర్ క్యామియోలు అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఇందులో రజని పాత్ర పేరు దేవా. పోర్టులో మాఫియా సామ్రాజ్యం నడిపే ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఆయనని చూపించే విధానం మాములుగా ఉండదట. ఎలివేషన్లు, యాక్షన్ బ్లాకులు ఓ రేంజ్ లో వచ్చాయని టాక్.
కాకతాళీయంగా కూలికి రెండు నెలల ముందు జూన్ 20 రిలీజవుతున్న కుబేరలో ధనుష్ పేరు కూడా దేవానే. బిచ్చం అడుక్కునే స్థాయి నుంచి ఆర్థిక వ్యవస్థని శాశించే కోటీశ్వరుడిగా హీరో పాత్రని దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా ఇంటెన్స్ గా డిజైన్ చేశారట. అంటే పేరులోనే కాదు క్యారెక్టరైజేషన్ పరంగానూ కూలి, కుబేరలకు దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లోనూ నాగార్జున ఉండటం. రజని కూతురితో ధనుష్ విడిపోయినప్పటికీ ఫ్యాన్స్ దృష్టిలో మాత్రం ఇద్దరూ మామ అల్లుడే. అందుకే ఇంత దగ్గరి సారూప్యతలు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కంటెంట్, బిజినెస్ పరంగా కూలి, కుబేరలు హయ్యెస్ట్ ఫిగర్స్ నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డబ్బింగ్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. మన నిర్మాతల పోటీని చూసి ధరను వేలం పాట రేంజ్ లో పెంచుతున్నారని డిస్ట్రిబ్యూటర్ వర్గాల టాక్. అయినా దేవా అనేది కొన్ని వందల సినిమాల్లో హీరోలు వాడుకునే పేరు. దానికో మాస్ వైబ్ ఉంటుంది. అందుకే లోకేష్ కనగరాజ్, శేఖర్ కమ్ముల తమ హీరోలకు అదే నేమ్ వాడుకున్నారు. కూలికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా కుబేరకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆడియో పరంగానూ ఈ ఆల్బమ్స్ మీద పెద్ద హైప్ నెలకొంది.
This post was last modified on May 15, 2025 11:06 am
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్‌లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్‌లో టాలీవుడ్ సృష్టించిన…
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…