చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ కుమార్ హిరాని. కెరీర్ ఆరంభంలోనే ఆయనకు గొప్ప పేరు తెచ్చిన చిత్రాలు.. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్. ఆ తర్వాత 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి క్లాసిక్స్ అందించాడు. ఆయన చివరి చిత్రం ‘డంకీ’ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. మళ్లీ తన మార్కు చూపించడానికి ‘మున్నాభాయ్’ ఫ్రాంఛైజీ మీద హిరాని దృష్టిసారించినట్లు వార్తలు వచ్చాయి. హిరాని సైతం తాను ‘మున్నాభాయ్-3’ స్క్రిప్టు మీద పని చేస్తున్నట్లు చెప్పాడు.
ఈ సీక్వెల్ గురించి చాలా ఏళ్ల కిందటే వార్తలు వచ్చాయి. ‘మున్నాభాయ్ ఛలే అమెరికా’ పేరుతో సినిమా అనుకున్నారు. కానీ అది ముందుకు కదల్లేదు. ఐతే ఇటీవల ‘మున్నాభాయ్-3’ మీద హిరాని సీరియస్‌గా కనిపించడంతో ఆ సినిమా పట్టాలెక్కుతుందనే అనుకున్నారు. కానీ స్క్రిప్టు అనుకున్నంత బాగా రాలేదా.. లేక వేరేదైనా కారణాలున్నాయా తెలియదు కానీ.. హిరానీ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడని అంటున్నారు.
ప్రస్తుతం ఆయన విక్రాంత్ మాసే, విక్కీ కౌశల్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్ తీసే పనిలో పడ్డారు. ఇది పూర్తయ్యాక ఆమిర్ ఖాన్‌తో హిరాని జట్టు కట్టబోతున్నారట. 3 ఇడియట్స్, పీకే తర్వాత హ్యాట్రిక్ మూవీ మీద వీళ్లిద్దరూ పని చేయబోతున్నారట. తమ శైలికి తగ్గట్లే లైట్ హార్టెడ్ కామెడీ, ఎమోషనల్ టచ్ ఉన్న సబ్జెక్టుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లొచ్చని సమాచారం. దీంతో ‘మున్నాభాయ్-3’కి మరోసారి బ్రేక్ పడినట్లే అని.. ఇక ఆ సినిమా తెరకెక్కడం అనుమానమే అని బాలీవుడ్ వర్గాల సమాచారం.
This post was last modified on May 14, 2025 7:44 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…