టాలీవుడ్ అనే కాక ఇండియన్ బాక్సాఫీస్‌లో ఈ వేసవి పెద్దగా ఉత్సాహం నింపలేకపోయింది. మామూలుగా సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజై థియేటర్లు కళకళలాడుతుంటాయి కానీ.. గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. మిడ్ రేంజ్, చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. వాటిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలు తక్కువగానే ఉంటున్నాయి. ఈ ఏడాది వేసవి సీజన్ పేలవంగా ఆరంభమైంది. సరైన సినిమాలు పడక ఏప్రిల్ నెల బాక్సాఫీస్ డల్లుగా తయారైంది. అలాంటి టైంలో మే 1న నాని సినిమా ‘హిట్-3’ వచ్చి థియేటర్లను కళకళలాడించింది. చాన్నాళ్ల తర్వాత వెండి తెరలు వెలిగిపోయాయి ఈ చిత్రంతో. హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లలో సందడి కనిపించింది.
ఈ ఊపును కొనసాగిస్తూ గత వారం ‘సింగిల్’ సినిమా కూడా మంచి స్పందనే తెచ్చుకుంది. వీకెండ్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. వీక్ డేస్‌లో పర్వాలేదనిపిస్తోంది. కానీ రెండు వారాలు సందడిగా సాగిన బాక్సాఫీస్.. మళ్లీ కళ తప్పే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వారం, తర్వాతి వారం చెప్పుకోదగ్గ సినిమాలే లేవు. ఈ వీకెండ్లో ఎలెవన్, 23 లాంటి సినిమాలు వస్తున్నాయి కానీ.. వాటికి బజ్ లేదు.
ఈ సినిమాలు రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు తెలియని పరిస్థితి. కంటెంట్ బాగుండి, ఫుల్ పాజిటివ్ రివ్యూలు వస్తే తప్ప వీటి వైపు ప్రేక్షకులు చూడడం కష్టమే. తర్వాతి వారంలో అయితే ఈ మాత్రం సినిమాలు కూడా లేవు. ప్రస్తుతానికి ఆ వీకెండ్ ఖాళీగానే కనిపిస్తోంది. చివరి వారంలో రావాల్సిన ‘కింగ్‌డమ్’ వాయిదా పడిపోయింది. ఆ స్థానంలో రాబోతున్న ‘భైరవం’ ఏమేర బజ్ తెచ్చుకుంటుందో చూడాలి. జూన్ 5న థగ్ లైఫ్ రావాల్సి ఉంది. 13న ‘హరిహర వీరమల్లు’ వస్తుందంటున్నారు. అప్పటికి కానీ మళ్లీ థియేటర్లలో అనుకున్నంత సందడి కనిపించదేమో.
This post was last modified on May 14, 2025 7:32 pm
ఈ మధ్య చిన్న సినిమాలకు వివాదాలే ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి. ఇడుపు కాయితం అనే చిన్న సినిమా విషయంలో ఇలాగే…
ఏపీలో కియా రెండో ప్లాంట్ విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. నవంబర్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి.. నిన్న మొన్నటి వరకు జాతీయ మీడియా వాటర్ మ్యాన్ అంటూ.. ప్రశంసలు…
ఏపీలో ఇప్పటికే ఫలితాలు వెల్లడైన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే,…
అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆల్కహాల్ చాలా నెలలుగా ల్యాబ్ లో మగ్గుతోంది. సితార లాంటి పెద్ద సంస్థ నిర్మాణంలో…
కొన్ని నెలల ముందు ‘పెద్ది’ సినిమాతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు బుచ్చిబాబు సానా. ఐతే ఆ సినిమా అంతిమంగా ఆశించిన…