Movie News

కింగ్ డమ్ ఫిక్స్ – తమ్ముడు తప్పుకున్నట్టేనా

మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా అఫీషియల్ ముద్ర కాస్త ఆలస్యంగా వేశారు. కొత్త డేట్ జూలై 4గా నిర్ణయించారు. ఇదే స్లాట్ ని కొద్దిరోజుల క్రితం నితిన్ తమ్ముడు కోసం నిర్మాత దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ తో ఉన్న సంబంధాల దృష్ట్యా ఎస్విసి కనక సానుకూల నిర్ణయం తీసుకుంటే తమ్ముడు మరోసారి డేట్ మార్చుకోక తప్పదు. అంతర్గతంగా చర్చలు జరిగిన తర్వాతే ఈ డెషిషన్ తీసుకుని ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. కాకపోతే తమ్ముడు ఉంటాడా తప్పుకుంటాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

సో ముందు అనుకున్న ప్రకారమైతే 35 రోజులు ఆలస్యంగా కింగ్ డమ్ వస్తోంది. ఇప్పుడు తగినంత సమయం దొరకడంతో రీ రికార్డింగ్, ప్యాన్ ఇండియా ప్రమోషన్లను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాని శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. ఇప్పటిదాకా టాలీవుడ్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్ టచ్ చేయని మాట వాస్తవం. తమిళంలో మణిరత్నం లాంటి దర్శకులు అమృత రూపంలో  స్పృశించారు కానీ మన దగ్గర పెద్దగా లేవు. అందుకే కింగ్ డమ్ కంటెంట్ పరంగా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనే ధీమా సదరు టీమ్ లో కనిపిస్తోంది.

జూన్ లో తగ్ లైఫ్, హరిహర వీరమల్లు, కుబేర, కన్నప్ప, సితారే జమీన్ పర్ లతో నిండిపోయింది కానీ కింగ్ డం జూలైకి వెళ్లిపోవడం మంచి నిర్ణయం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే రిలీజైన ఆడియో సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. బీజీఎమ్ కోసం ఇప్పుడు ఒత్తిడి లేదు కాబట్టి అనిరుద్ నుంచి బెస్ట్ ఆశించవచ్చు. సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న కింగ్ డమ్ తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళంలో పెద్ద ఎత్తున థియేటర్ రిలీజ్ చేస్తున్నారు. బిజినెస్ ఆఫర్లు క్రేజీగా వస్తున్నాయట. 

This post was last modified on May 14, 2025 12:35 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

13 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

32 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

37 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago