సినిమాల రిలీజ్ లేదు. షూటింగుల్లేవు. ప్రారంభోత్సవాల్లేవు. సినిమాలకు సంబంధించి ఏ అప్ డేట్స్, విశేషాలు పంచుకునే పరిస్థితి కూడా లేదు. మరి సినీ అభిమానుల్ని ఎంగేజ్ చేయడం ఎలా? ఈ విషయంపై బాగా ఆలోచించి హీరోల అభిమానులకు టాస్కుల మీద టాస్కులిస్తున్నారు పీఆర్వో, ప్రమోషనల్ టీంలు.
గత కొంత కాలంలో టాలీవుడ్లో ఒక సంస్కృతి నడుస్తోంది. పాత సినిమాలకు వార్షికోత్సవాలప్పుడు హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేయడం బాగా ఊపందుకుంది. ఒకప్పుడేతే బ్లాక్ బస్టర్లు, క్లాసిక్ సినిమాలకు వార్షికోత్సవాలు జరిగినపుడు.. అవి కూడా పదేళ్లు, ఇరవయ్యేళ్లు లాంటి మైల్ స్టోన్స్ వస్తే ఇలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేసేవాళ్లు.
కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. వార్షికోత్సవం అంటే చాలు చెలరేగిపోతున్నారు. హిట్టు, ఫ్లాప్ అని చూడకుండా ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ‘జానీ’ సినిమాకు 17 ఏళ్లు పూర్తయితే ట్రెండ్ చేశారు. తర్వాత ‘వీరభద్ర’ లాంటి సినిమాకు కూడా కొందరు యానివర్శరీ ట్వీట్లు వేయడం గమనార్హం.
ఎన్టీఆర్ బర్త్డ్ డేకి నెల రోజులుందని.. ‘పోకిరి’ సినిమాకు 14 ఏళ్లు ఉందని కూడా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. ఇందుకోసం ఫేక్ అకౌంట్లు పెద్ద ఎత్తున పని చేశాయన్న విమర్శలూ వచ్చాయి. దీని మీద పెద్ద రచ్చే జరిగింది.
ఇది ఇప్పుడు సమయం సందర్భం లేకుండా ‘వుయ్ లవ్ రామ్ చరణ్ అన్న’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. చరణ్ గత నెలలోనే పుట్టిన రోజు చేసుకున్నాడు. అప్పుడు చేయాల్సిన సందడంతా చేశారు. కానీ ఇప్పుడు ఏ అకేషన్ లేకున్నా హ్యాష్ ట్యాగ్ పెట్టారు. పైన చెప్పిన హ్యాష్ ట్యాగ్‌లో ఒక్కో పదాన్ని ఒక్కో భాషలో రూపొందించి.. దాన్ని ట్రెండ్ చేయడం ద్వారా చరణ్ పాన్ ఇండియా స్టార్ అని చాటే ప్రయత్నం చేస్తున్నారు.
1 మిలియన్ ట్వీట్లు టార్గెట్ పెట్టి మరీ దీన్ని ట్రెండ్ చేశారు. ఆ టార్గెట్ అందుకున్నారు కూడా. ఇందుకోసం తెర వెనుక ఎన్ని ప్రయత్నాలు జరిగాయో తెలియదు మరి. అసలు సందర్భం లేకుండా ఇలా హ్యాష్ ట్యాగ్ పెట్టి అభిమానులకు టాస్కులివ్వడం ఏంటో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఏంటన్నది కూడా తెలియట్లేదు.
This post was last modified on April 30, 2020 6:13 pm
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…