తెలుగులో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగానే గుర్తుకొచ్చే సినిమా ‘బొమ్మరిల్లు’. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని వయసుల వాళ్లనూ ఉర్రూతలూగించిన సినిమా అది. సిద్దార్థ్, జెనీలియా జంటగా దిల్ రాజు నిర్మాణంలో కొత్త దర్శకుడు భాస్కర్ రూపొందించిన ఆ చిత్రం 2006లో విడుదలై సంచలన విజయం సాధించింది. స్టార్ హీరో సినిమా కాదు కాబట్టి వంద రోజుల సెంటర్లు, కలెక్షన్ల లెక్కల గొప్పలు లేవు కానీ.. అప్పట్లో ఈ సినిమా మామూలుగా ఆడలేదు. విషయం, ఆదరణ.. ఈ రెండు కోణాల్లో ఎలా చూసినా టాలీవుడ్ అత్యుత్తమ చిత్రాల్లో ‘బొమ్మరిల్లు’ ఒకటి.
ఈ చిత్రం పలు భాషల్లో రీమేక్ అయింది. తమిళంలో జయం రవి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కి అక్కడా విజయం సాధించింది. జెనీలియా అందులో హీరోయిన్. అలాగే హిందీలో సైతం బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ హిందీ రీమేక్ హక్కులు తీసుకున్నారు. ‘ఇట్స్ మై లైఫ్’ పేరుతో రీమేక్ చేశారు.
స్టార్ డైరెక్టర్ అనీస్ బజ్మి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హర్మేన్ బవేజా సిద్దార్థ్ పాత్రను భర్తీ చేస్తే.. ఒరిజినల్లో తాను చేసిన పాత్రనే హిందీలో జెనీలియా పోషించింది. ప్రకాష్ రాజ్ చేసిన తండ్రి పాత్రలో నానా పటేకర్ నటించారు. ఐతే క్రేజీ కాంబినేషన్లో, మంచి అంచనాల మధ్య మొదలై పూర్తయిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేకపోయింది. కొంత కాలానికి అందరూ ఆ సినిమా గురించి మరిచిపోయారు.
నిర్మాత బోనీనే ఆ సినిమాను పట్టించుకోలేదు. ఐతే ఇప్పుడు ఆ చిత్ర హీరో హీరోయిన్లు అసలు లైమ్ లైట్లో లేని సమయంలో ‘ఇట్స్ మై లైఫ్’ విడుదలకు సిద్ధమవుతండటం విశేషం. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుండటంతో కొన్ని పాత చిత్రాలను కూడా వీటిలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ‘ఇట్స్ మై లైఫ్’ను జీ5న ఈ నెల 29న స్ట్రీమ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఇంత పాత సినిమాను ఇప్పుడు జనాలు ఏమేర ఆదరిస్తారో చూడాలి.
This post was last modified on November 6, 2020 3:18 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…