ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో బాగా ట్రెండ్ అయిన సినిమా.. పెరుసు. లెజెండరీ తెలుగు డైరెక్టర్ కోదండరామిరెడ్డి తనయులు వైభవ్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ప్లాట్ పాయింట్ అడల్ట్ టచ్ ఉన్నదే అయినా.. హద్దులు దాటని కామెడీతో ఈ సినిమాను భలేగా నడిపించి మెప్పించింది చిత్ర బృందం. తమిళంతో పాటు వేరే భాషల వాళ్లూ ఈ సినిమాను బాగా చూశారు. ఈ చిత్రంలో వైభవ్‌కు జోడీగా నటించి మెప్పించిన అమ్మాయి నిహారిక ఎన్ఎం. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఈ అమ్మాయి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఇన్‌స్టాలో ఏకంగా 35 మిలియన్ల ఫాలోవర్లున్నారు ఆ అమ్మాయికి. గతంలో మహేష్ బాబు సైతం ఈ అమ్మాయితో కలిసి తన ప్రొడక్షన్లో వచ్చిన ‘మేజర్’ మూవీని ప్రమోట్ చేయడం విశేషం. ఇప్పుడు నిహారిక ఒక పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది పూరి జగన్నాథ్ కావడం విశేషం.
విజయ్ సేతుపతి హీరోగా పూరి ఇటీవలే ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సేతుపతికి జోడీగా అనేక పేర్లను పరిశీలించిన చిత్ర బృందం.. చివరికి నిహారికను ఎంపిక చేసినట్లు సమాచారం. ‘పెరుసు’ సినిమాలో నిహారిక పెర్ఫామెన్స్ నచ్చి ఆమెను పిలిచి ఆడిషన్ చేసింది చిత్ర బృందం. అందులో ఇంప్రెస్ చేయడంతో ఆమెనే ఫైనలైజ్ చేశారట. ఇందులో అన్నీ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే ఉంటాయని.. నిహారికది కూడా అలాంటి పాత్రే అని సమాచారం. తన కెరీర్‌ను మలుపు తిప్పే సినిమాగా ఇది నిలవడం ఖాయం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రాధికా ఆప్టే నటిస్తోందనే వార్తలు నిజం కాదని తెలిసింది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.
This post was last modified on May 12, 2025 3:50 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…