‘పెళ్ళి సందడి’ అనే సబ్ స్టాండర్డ్ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది తెలుగు మూలాలున్న కన్నడ అమ్మాయి.. శ్రీ లీల. తన తొలి సినిమా కంటెంట్ చాలా వీక్ అయినప్పటికీ.. తన అందచందాలు, డ్యాన్స్‌తో అదరగొట్టి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. రెండో చిత్రం ‘ధమాకా’ హిట్ కావడంతో ఆమెకు తిరుగులేకపోయింది. కొన్నేళ్ల వ్యవధిలోనే ఆమె సినిమాల సంఖ్య డబుల్ డిజిట్‌కు చేరిపోయింది. తెలుగుకే పరమితం కాకుండా బహుభాషలకు ఆమె ప్రభ విస్తరిస్తోంది. ఆల్రెడీ తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’లో నటిస్తున్న శ్రీలీలకు హిందీలో ‘ఆషికి-3’ లాంటి క్రేజీ మూవీలో అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు బాలీవుడ్లో ఆమెకు మరో పెద్ద ఆఫర్ దక్కినట్లు సమాచారం. బాలీవుడ్లో శ్రీలీల నటించబోయే రెండో చిత్రం కూడా సీక్వెలే కావడం విశేషం. కరణ్ జోహార్ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ నిర్మించబోయే ఆ చిత్రమే.. దోస్తానా-2. జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ నటించిన ‘దోస్తానా’ పెద్ద హిట్టే అయింది.
దీనికి కొనసాగింపుగా కార్తీక్ ఆర్యన్, ‘కిల్’ ఫేమ్ లక్ష్య, జాన్వి కపూర్‌లతో ‘దోస్తానా-2’ చేయాలనుకున్నారు. కానీ అది ముందుకు కదల్లేదు. కానీ ఇప్పుడు కార్తీక్ స్థానంలో విక్రాంత్ మాసే, జాన్వి స్థానంలో శ్రీలీలను ఎంపిక చేసి సినిమాను పట్టాలెక్కిస్తున్నారని సమాచారం. ఆమిర్ ఖాన్‌తో ‘లాల్ సింగ్ చడ్డా’ లాంటి డిజాస్టర్ తీసిన అద్వైత్ చౌహాన్ ‘దోస్తానా-2’ను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకపోవచ్చని.. నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజయ్యేలా డీల్ చేసుకుని ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడట కరణ్ జోహార్.
This post was last modified on May 12, 2025 3:39 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…