నిన్న లండన్ రాయల్ అల్బర్ట్ హాల్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ కన్సర్ట్ బ్రహ్మాండంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో ప్రాంగణం మొత్తం హైదరాబాద్ వాతావరణాన్ని తలపించింది. ఇంత జన సందోహం చూసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. చాలా నెలలుగా ఒకే స్టేజి మీద కనిపించే సందర్భం, అవసరం దొరకని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలుసుకోవడం ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఎంత దోస్తీ ఉందో మరోసారి బహిర్గతమయ్యింది. చేతిలో చేయి వేసుకుని ఇద్దరు స్టేజి దగ్గరకు రావడంతో మొదలై మాట్లాడిన ప్రతి మాటలోనూ అది స్పష్టంగా కనిపించింది.
మే 20 తారక్ పుట్టినరోజుని పురస్కరించుకుని అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెప్పిన చరణ్ అక్కడే కౌగలించుకుని ముద్దు పెట్టేసుకోవడం వీడియో రూపంలో బాగా వైరలయ్యింది. క్యూ అండ్ ఏ సెషన్ లో జూనియర్ మాట్లాడుతూ తనకు దొరికిన ఒక గొప్ప ఫ్రెండ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించడం మర్చిపోలేని అనుభూతులను ఇచ్చిందని, ఆస్కార్ సాధించిన నాటు నాటు పాట తమ మార్గదర్శకులైన చిరంజీవి, బాలకృష్ణలు కలిసి డాన్స్ చేయడానికి సృష్టించిన చిన్న గ్లిమ్ప్స్ లా అనిపించిందని చెప్పడంతో ఆడిటోరియం చప్పట్లతో హోరెత్తిపోయింది. మాట్లాడుతున్నంత సేపూ జూనియర్ ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు.
ఎన్నో సంవత్సరాల తర్వాత తారక్ నుంచి బాలయ్య బాబాయ్ ప్రస్తావన రావడం అన్నింటికన్నా హైలైట్. ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ ఒకపక్క జరుగుతూనే ఇంకోవైపు కీరవాణి లైవ్ ఆర్కెస్ట్రాని ప్లే చేయించడం మంచి అనుభూతి ఇచ్చింది. లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో లేకపోయినా థియేటర్ కు వచ్చిన వేలాది ప్రేక్షకుల దగ్గర సెల్ ఫోన్లు ఉండటంతో వీడియోలు నిమిషాల వ్యవధిలో వైరలయ్యాయి. మహేష్ బాబు వస్తాడనే ప్రచారం జరిగింది కానీ చివరి నిమిషంలో ఏదో కారణం వల్ల క్యాన్సిల్ అయ్యిందట. కుదిరి ఉంటే ఒకే స్టేజి మీద తారక్, చరణ్, మహేష్ ని చూసే అరుదైన దృశ్యం చూసేవాళ్ళం. జస్ట్ మిస్.
This post was last modified on May 12, 2025 11:21 am
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…