రంగస్థలం చిత్రం మొదలు కాక ముందు సమంత పెళ్లి కాలేదు కానీ చైతన్యతో పెళ్లనేది నిశ్చయమైపోయింది. పెళ్లి తర్వాత సమంత నటించిన ఆ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. అయినా కానీ పెళ్లయిన హీరోయిన్‍కి పెద్ద సినిమాల్లో చోటు దక్కడం కష్టం కనుక సమంతకి ఆ తర్వాత అలాంటి పెద్ద అవకాశాలేమీ రాలేదు. ఇప్పుడు అచ్చంగా ఇలాంటిదే కాజల్ విషయంలో రిపీట్ అయింది.
ఆచార్య మొదలు కాక ముందు కుమారి అయిన కాజల్ ఇప్పుడు శ్రీమతిగా మారింది. శ్రీమతి కాజల్ హోదాలో త్వరలోనే ఆచార్య సెట్లోకి కాజల్ అడుగు పెట్టబోతోంది. ముందుగా ఇందులో హీరోయిన్ త్రిష అనుకున్నారు కానీ ఆమె ఏవో కారణాల చేత తప్పుకుంది. దాంతో ఖైదీ నంబర్ 150లో చిరంజీవికి జోడీగా నటించిన కాజల్‍నే ఖరారు చేసుకున్నారు. హీరోయిన్‍గా తన ప్రైమ్ టైమ్ దాటిపోయినా కానీ ఇన్నాళ్లూ కాజల్ ఏదో ఒక అవకాశం దక్కించుకుంటూనే వచ్చింది.
సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకని సిట్యువేషన్‍ని కూడా బాగానే క్యాష్ చేసుకుంది. అయితే ఆచార్య తర్వాత కాజల్‍కి ఇక ఇలాంటి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తాయనేది అనుమానమే. బహుశా తనకు ఇక పెద్దగా అవకాశాలు వచ్చేది లేదని తెలుసుకున్న తర్వాతే కాజల్ పెళ్లి చేసుకుందేమో కానీ అనుష్క, సమంత మాదిరిగా తెలుగు సినిమాపై తను కూడా మంచి ఇంపాక్ట్ వేయగలిగింది.
This post was last modified on November 6, 2020 11:03 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…