బిగ్‌బాస్ షోలో కేవలం టాస్కులు సరిగ్గా ఆడితేనో, ఎవరిలా వాళ్లుంటేనో, పాయింట్లు మాట్లాడితేనో సరిపోదు. సమయానుసారం బిగ్‌బాస్ టీమ్ వేసే జిత్తులను కూడా గుర్తించాలి. బిగ్‌బాస్ డైరెక్టర్లు ఫలానా కంటెస్టెంట్లు చివరి వరకు వుండాలని ముందే ఫిక్స్ అవుతారు. ఎవరయినా తమకు అక్కర్లేని కంటెస్టెంట్లు కనుక క్రౌడ్‌ని ఆకట్టుకుంటున్నారని అనిపిస్తే వెంటనే వాళ్ల ఫాలోయింగ్ తగ్గేలా వారి వీక్నెస్లు హైలైట్ అయ్యేట్టు చేస్తారు. దీనిని పసిగట్టి తమ బలహీనతలు బయటపడకుండా చూసుకోవడమే అసలు కిటుకు.
గత రెండు వారాలలో అరియానాకు ఓట్లు బాగా పడ్డాయి. దాంతో సమంత, నాగార్జునతో ఆమెకు ఈగో బూస్టింగ్ ఇప్పించి వదిలేసారు. నాగార్జునతో ఏకంగా టాప్‌లో వున్నావని అనిపించారు. దాంతో ఇక అరియానా ఉత్సాహం కట్టలు తెంచుకుంది. తనేదో సూపర్ గేమ్ ఆడేస్తున్నానని భ్రమపడి ఈ వారం మొత్తం తెగ ఓవరాక్షన్ చేసింది. కెప్టెన్‌గా సోహైల్‌తో చాలా దారుణంగా ప్రవర్తించింది. ఆ తర్వాత నామినేషన్ టాస్కులో మోనల్, హారికతో శాడిస్టిక్‌గా బిహేవ్ చేసింది. పదే పదే అవతలి వాళ్లను బ్యాడ్ చేసే స్టేట్మెంట్లు ఇస్తూ మళ్లీ తనని ఏమైనా అంటే బ్యాడ్ చేయొద్దని అంటూ వుంటుంది.
ఆమెను ఎక్స్పోజ్ చేయడానికి బిగ్‌బాస్ వాడిన మరో అస్త్రం.. తన కెప్టెన్సీలో ఎవరు బాగా పర్ఫార్మ్ చేసారని అడగడం. ఇందులో తనను తాను కూడా చెప్పుకోవచ్చు అని ఇచ్చిన ఆదేశాన్ని వాడేసుకుని మళ్లీ కెప్టెన్సీ బరిలోకి దిగింది. అంతటితో ఆగకుండా తన కెప్టెన్సీ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల బిగ్‌బాస్ తనకీ అవకాశం ఇచ్చాడని డబ్బా కొట్టుకుంది. వరుసగా మూడు రోజుల పాటు తనకు తాను సెల్ఫ్ డ్యామేజ్ చేసుకున్న అరియానా మరి మళ్లీ జనాలను ఆకట్టుకోగలదా లేక బిగ్‌బాస్ డైరెక్షన్లో టోటల్‌గా ట్రాక్ తప్పిపోతుందా చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates