Movie News

కల్ట్ కోసం కట్టెడు జాగ్రత్తలు

విశ్వక్ సేన్ కొత్త సినిమా కల్ట్ ఓపెనింగ్ ఈ రోజు జరిగింది. దర్శకుడిగా ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత ఇది మూడో ప్రయత్నం. చాలా మంది కొత్త నటీనటులను దీని ద్వారా పరిచయం చేయబోతున్నాడు. ఆడిషన్లకే ఎక్కువ సమయం పట్టింది. సంగీత దర్శకుడిగా రవి బస్రూర్ ని తీసుకోవడం దగ్గరి నుంచి తరుణ్ భాస్కర్ ని డైలాగులు రాయడానికి ఒప్పించడం వరకు విశ్వక్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముందు డైరెక్షన్ మాత్రమే చేద్దామనుకున్నాడు. కానీ ఒక ముఖ్యమైన పాత్రకు ఇమేజ్ ఉన్న నటుడు దొరక్కపోవడంతో ఆ బాధ్యతా తనే తీసుకున్నాడు. నలభైకి పైగా కొత్త మొహాలను టాలీవుడ్ ఈ కల్ట్ లో చూడబోతోంది.

చూస్తుంటే తన గత సినిమాల్లో టెక్నికల్ గా జరిగిన లోపాలను విశ్వక్ సేన్ గుర్తించి దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. లైలా విషయంలో ఎంత దారుణమైన తప్పు జరిగిందంటే ఏకంగా ప్రేక్షకులకు సారీ చెప్పాల్సి వచ్చింది. అంతకు ముందు గామి, గ్యాంగ్స్ అఫ్ గోదావరి, దాస్ కా ధమ్కీ మొదలైనవి వినడానికి బాగున్న కంటెంట్లే. కానీ దర్శకుల ఎగ్జిక్యూషన్ లో జరిగిన తప్పుల వల్ల ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. అందుకే ఈసారి సాలిడ్ గా సపోర్ట్ తీసుకుని రంగంలోకి దిగుతున్నాడు విశ్వక్. ప్రయోగం చేస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా స్క్రిప్ట్ రాసుకున్నాడట.

విశ్వక్ సేన్ చేసిన మరో మంచి పని మలయాళం, తమిళ, కన్నడ డబ్బింగుల జోలికి వెళ్ళకపోవడం. ఊరికే ఖర్చు తప్ప ఆ భాషల అనువాదాలు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించి తెలివిగా జాపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ కు పరిమితం చేయడం మంచి ఆలోచన. కల్ట్ అనేది యూత్ లో రెగ్యులర్ గా వినిపించే ట్రెండీ పదం. దాన్ని వాడుకోవడం మార్కెటింగ్ ఎత్తుగడగా పనికొస్తుంది. దీనికన్నా ముందు అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన ఫంకీ ఇదే ఏడాదిలో విడుదల కానుంది. కల్ట్ బహుశా 2026కి వెళ్ళిపోవచ్చు. బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అవుతుందట. సబ్జెక్టుని నమ్మినప్పుడు పెట్టాలి మరి.

This post was last modified on May 11, 2025 12:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

4 minutes ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

7 minutes ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

28 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago