రాజమౌళి సినిమాలో హీరో వేషం వేసే అవకాశం ఇక మిడ్ రేంజ్ హీరోలకు ఎలాగో రాదు. త్రివిక్రమ్, కొరటాల లాంటి అగ్ర దర్శకులు కేవలం సూపర్‍స్టార్స్తో తప్ప పని చేయరు. దీంతో మిడ్ రేంజ్ హీరోలకు తమ మార్కెట్ పెంచుకోవడమెలా అనేది తెలియడం లేదు. ఇలాంటి టైమ్‍లో త్రివిక్రమ్‍తో పని చేసే అవకాశముందనేది కొందరు హీరోలు పసిగట్టారు.
గతంలో నితిన్ ‘అ ఆ’ సినిమాలో పారితోషికం తీసుకోకుండా చేసాడు. త్రివిక్రమ్ డైరెక్షన్‍లో నటించడమే మహాప్రసాదం అంటూ రెమ్యూనరేషన్ రిజెక్ట్ చేసాడు. ఇప్పుడు అలాగే కొందరు యువ హీరోలు త్రివిక్రమ్‍తో అయితే ఫ్రీగా చేస్తామంటూ ముందుకొస్తున్నారు. ఎన్టీఆర్‍తో అనుకున్న సినిమా ఆలస్యమయితే త్రివిక్రమ్ ఈలోగా ఒక మిడ్ రేంజ్ సినిమా చేసేసుకోవచ్చు. అయితే దీనిపై ఇంకా త్రివిక్రమ్ నిర్ణయం తీసుకోలేదు.
రామ్‍తో చేస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నా కానీ ఇంకా దానిపై క్లారిటీ లేదు. రామ్‍కి ఛాన్స్ వుందనే సరికి ఇంకొందరికి కూడా ఆశ పుట్టిందట. అయితే త్రివిక్రమ్ మాత్రం తారక్ కోసం ఎదురు చూస్తున్నాడట. అల వైకుంఠపురములో తర్వాత చేసే సినిమాలో ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తే వుండే క్రేజ్ ఎలా వుంటుందనేది త్రివిక్రమ్‍కి బాగా ఎరుక.
This post was last modified on November 6, 2020 8:06 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…