జైలర్ 2లో బాలకృష్ణ ప్రత్యేక క్యామియో చేయడం దాదాపు ఖరారయినట్టే. టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ బాలయ్య వైపు నుంచి అంగీకారం వెళ్ళిపోయిందట. పాత్ర ప్రాధాన్యం దృష్ట్యా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు చెన్నై కథనం. సుమారు ఇరవై కోట్ల దాకా ఉండొచ్చని వినికిడి. మొదటి భాగంలో కన్నడ శివరాజ్ కుమార్, మలయాళం మోహన్ లాల్ నటించారు కానీ తెలుగు నుంచే స్టార్ గెస్ట్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. కొన్ని నెలల క్రితం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్ట్ 1 కోసమే బాలయ్యను అనుకున్నానని కానీ సాధ్యపడలేదని చెప్పుకొచ్చాడు. ఇప్పటికి కుదిరింది.
అసలు కిక్కిచ్చే మ్యాటర్ వేరే ఉంది. ఇన్ సైడ్ లీక్స్ ప్రకారం బాలకృష్ణ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారట. అంటే ముత్తువేల్ పాండియన్ (రజని పాత్ర పేరు) ఫ్లాష్ బ్యాక్ లో ఈ ఇద్దరి మధ్య యునిఫార్మ్ లో వచ్చే ఎపిసోడ్స్ చాలా బాగా రాసుకున్నారని టాక్. బాలయ్యకి ఐకానిక్ క్యారెక్టర్స్ గా నిలిచిపోయిన లక్ష్మి నరసింహ పేరుని ఇందులో వాడుకోవచ్చని అంటున్నారు. తొలుత రౌడీ ఇన్స్ పెక్టర్ లో రామరాజుని అనుకున్నారట కానీ ఫైనల్ గా దిలీప్ మొదటి దానికే ఓటేసినట్టు తెలిసింది. అంటే రజని, బాలయ్య ఖాకీ దుస్తుల్లో చూపించబోయే మాస్ ఎలివేషన్లకు థియేటర్లు బద్దలవ్వడం ఖాయం.
ప్రస్తుతానికి ఇది అనధికార టాక్ కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ ఎలివేషన్లతోనే మాస్ అనిపించుకునే దిలీప్ ఈ రేర్ కాంబోని చాలా పెద్ద స్థాయిలో చూపిస్తాడనేది వాస్తవం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న జైలర్ వచ్చే ఏడాది వేసవికి విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ముందు సంక్రాంతి అనుకున్నారు కానీ విజయ్ జన నాయగన్ ఉండటంతో డ్రాపయ్యారు. అందులోనూ కూలికి దీనికి మధ్య కేవలం అయిదు నెలల గ్యాపే ఉండటం సబబు కాదు కాబట్టి సమ్మర్ కి వెళ్లిపోతున్నారు. ఇంకా సగం షూట్ కాకుండానే జైలర్ 2 తెలుగు హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇంకా ఫైనల్ కాలేదు.
This post was last modified on May 10, 2025 2:44 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…