చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉంది. విడుదల తేదీ ప్రకటిస్తే బిజినెస్ జరిగిపోతుంది. కానీ భైరవం టీమ్ మీనమేషాలు లెక్కబెడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – మంచు మనోజ్ – నారా రోహిత్ కలయికలో రూపొందిన ఈ విలేజ్ డ్రామాని మరీ ఆర్ఆర్ఆర్ రేంజ్ లో మల్టీస్టారర్ అనలేం కానీ మినీ స్టారరని చెప్పొచ్చు. ఆల్రెడీ ఒక పాట చార్ట్ బస్టర్ అయ్యింది. పోస్టర్లు, టీజర్ జనంలో ఆసక్తిని పెంచాయి. తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందిన భైరవంకు నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమవుతోంది.
అన్నీ బాగానే ఉన్నా ఎలాంటి చప్పుడు చేయకుండా భైరవం ఇంత మౌనంగా ఎందుకు ఉందనే సందేహం రావడం సహజం. మంచు విష్ణుతో ఉన్న విభేదాల దృష్ట్యా కన్నప్పకు పోటీగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని మనోజ్ పట్టుబడుతున్నట్టుగా ఒక వెర్షన్ ఉంది. అదే నిజమైతే జూన్ 27 అని ప్రకటించేయాలి. కానీ అలా జరగలేదు. వాస్తవమేంటో టీమ్ కే తెలుసు. ఇంకో వైపు ఓటిటి డీల్ ఎంతకీ తెగకపోవడం వల్లే నిర్మాత డేట్ వేయలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. ఆశించిన దానికన్నా తక్కువ మొత్తం ఆఫర్ చేయడం వల్ల వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే డిలే వల్ల బజ్ తగ్గడం మొదలయ్యింది.
చూస్తుంటే మేలో రావడం దాదాపు అసాధ్యమే. వచ్చే వారం స్లాట్ ఖాళీగా ఉన్నా భైరవం యూనిట్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. నెలాఖరులో 30న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఉంది. ప్రస్తుతానికి వీళ్ళు అదే తేదీకి కట్టుబడ్డారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తే వాయిదా పడొచ్చు. అది కూడా ఇంకా తేలలేదు. జూన్ 20 కుబేర, సితారే జమీన్ పర్ ఉన్నాయి. ఆపై వారం 27 కన్నప్ప దిగుతాడు. అటుపై జూలైలో ఇంకా కష్టం. ఇంత స్పష్టంగా సమీకరణాలు కనిపిస్తుంటే భైరవం ఇంకా విడుదల తేదీ దోబూచులాడటం గమనార్షం. ఎక్కువ ఆలస్యం చేసినా ఉన్న బజ్ తగ్గిపోయే ప్రమాదముంది.
This post was last modified on May 9, 2025 5:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…