కొత్త శుక్రవారం వచ్చేసింది. హిట్ 3 ది థర్డ్ కేస్ తో మే నెలకు బ్రహ్మాండమైన బోణీ దొరికాక ఇప్పుడు అందరి చూపు లేటెస్ట్ రిలీజుల వైపు వెళ్తోంది. పెద్ద హీరోలు నటించిన ప్యాన్ ఇండియాలు లేవు కానీ కంటెంట్ ను నమ్ముకున్న మీడియం మరియు చిన్న బడ్జెట్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వాటిలో మొదటిది ‘సింగిల్’. శ్రీవిష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ యూత్ ఎంటర్ టైనర్ కు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ట్రైలర్ జనంలోకి బాగానే వెళ్ళింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేశారు. బుక్ మై షో ట్రెండింగ్లోకి వచ్చేయడం శుభ సూచకం. టాక్ పాజిటివ్ గా వస్తే శ్రీవిష్ణు పంట పండినట్టే.
సమంత నిర్మాతగా మారి తీసిన చిన్న క్యామియో చేసిన ‘శుభం’కు మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో ప్రీమియర్లు వేస్తూనే ఉన్నారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ హారర్ కామెడీ మీద సామ్ నమ్మకం మాములుగా లేదు. ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకంతో రిస్క్ అయినా సరే అంత ముందుగా షోలు వేసేందుకు సిద్ధపడింది. వాటి నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది కానీ అసలైన స్పందన బయట పాడేది ఇవాళే. నవీన్ చంద్ర ‘బ్లైండ్ స్పాట్’ ఇవాళే వస్తోంది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రీ రిలీజ్ కు అనూహ్య మద్దతు కనిపిస్తోంది. నిన్న పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం ఈ క్లాసిక్ క్రేజ్ కి నిదర్శనం.
దేశ సరిహద్దుల్లో శత్రుదేశం పాకిస్థాన్ తో భీకర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జనాల మూడ్ ఎంతమేరకు సినిమాల మీద ఉందనేది ఇవాళ కలెక్షన్లలో బయట పడనుంది. ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా పాక్ వక్రబుద్ధి ఎప్పుడు ఏ రూపంలో ఎలా ముంచుకొస్తుందో చెప్పడం కష్టం. పబ్లిక్ ఎప్పటికప్పుడు టీవీ ఛానల్స్, ఆన్ లైన్ ద్వారా ఆర్మీ చేస్తున్న వీరోచిత పోరాటం గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. కాబట్టి నిశ్చింతగా సినిమాలకు రావాలని ఎగ్జిబిటర్లు కోరుకుంటున్నారు. మరి ఇవాళ్టి బిగ్ డేలో ఎవరు బాక్సాఫీస్ విజేతలు అవుతారో ఇంకొద్ది గంటల్లో తేలనుంది. చూద్దాం.
This post was last modified on May 9, 2025 7:31 am
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…