ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న కయదు లోహర్ మొదటి క్యాటగిరీలోకి వస్తోంది. శ్రీవిష్ణు అల్లూరితో మన ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ డ్రాగన్ వచ్చే
దాకా తనలో ఉన్న మేజిక్ జనాలకు అర్థం కాలేదు. కట్ చేస్తే తన డిమాండ్ తెలుగు తమిళ భాషల్లో విపరీతంగా పెరిగిపోయింది. నాని – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కబోయే ది ప్యారడైజ్ లో తనను తీసుకోవడం పక్కాని ఫిలిం నగర్ టాక్. ఇది చాలా పెద్ద ప్రమోషన్. ఈ ప్యాన్ ఇండియా మూవీ మీదున్న అంచనాల దృష్ట్యా ఇది క్రేజీ ఆఫర్.
ఇప్పటికే తను విశ్వక్ సేన్ ఫంకీలో భాగమయ్యింది. అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎంటర్ టైనర్ షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. అధర్వ – తమన్ నటిస్తున్న సినిమా, శింబు మూవీ, నివిన్ పౌలితో ఒక చిత్రం, జివి ప్రకాష్ కుమార్ తో మరొకటి ఇలా వరసగా తన ఖాతాలో పడ్డాయని చెన్నై రిపోర్ట్. రవితేజ – కిషోర్ తిరుమల కాంబో కోసం తనను సంప్రదించినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఖరారైనట్టే. ఇలా మొత్తం అరడజను పైగా కమిట్ మెంట్లతో ఉన్న కయదు లోహర్ డైరీ చూస్తే ఇంకో రెండేళ్ల దాకా కాల్ షీట్లు దొరకడం అనుమానంగానే ఉంది.
అంతేమరి విజయలక్ష్మి తలుపు తడితే కెరీర్ ఇలా మారిపోతుంది. తెలుగు తమిళంకు సమాన ప్రాధాన్యం ఇస్తానంటున్న కయదు లోహర్ రెమ్యునరేషన్ కూడా అంతే భారీగా పెరిగిందట. డ్రాగన్ ముందు వరకు ఛాన్స్ రావడమే ఎక్కువనుకుంటే ఇప్పుడు ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఇంకో రెండు మూడు హిట్లు పడ్డాయంటే భామ పూర్తిగా సెటిలైనట్టే. రష్మిక మందన్న, శ్రీలీల అంత సులభంగా దొరకలేని పరిస్థితిలో కయదు లోహర్ మరో బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి, డిమాండ్ ఉన్నప్పుడే కెరీర్ ని పీక్స్ కు తీసుకెళ్లాలి. కయదు లోహర్ చేస్తోంది ఇదే.
This post was last modified on May 8, 2025 6:25 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…