తెరమీద చూసే సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు వాటి షూటింగుల్లో కూడా ఊహించని ట్విస్టులు ఎదురవుతూ ఉంటాయి. కెజిఎఫ్ తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా శాండల్ వుడ్ తో పాటు తెలుగు తమిళ పరిశ్రమలు ఎదురు చూస్తున్న కాంతార చాప్టర్ 1కు కష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగిన దుర్ఘటనలో కపిల్ అనే జూనియర్ ఆర్టిస్టు నీటమునిగి చనిపోవడం యూనిట్ లో విషాదం రేపింది. ప్రస్తుతం కేరళ సౌపర్ణిక నది వద్ద చిత్రీకరణ చేస్తున్న హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టికి ఈ పరిణామాలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది ఇప్పుడు మొదలయ్యింది కాదు. నెలలుగా జరుగుతున్నదే.
బెంగళూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు ఏకంగా కర్ణాటక అటవీ శాఖా మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసి పర్యావరాణాన్ని హాని చేస్తున్నారంటూ కేసు నమోదు చేయించడం గత ఏడాది సంచలనం రేపింది. దాని గురించి ఇంకా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీని తర్వాత ఒకసారి టీమ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై కొందరు జూనియర్ ఆర్టిస్టులు గాయపడటంతో బ్రేక్ వేయాల్సి వచ్చింది. విపరీతమైన గాలి తుఫాను వల్ల సెట్స్ కూలిపోయి తీవ్ర నష్టం కలగడం మరో సంఘటన. ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో అవాంతరాలు కాంతారకు వస్తూనే ఉన్నాయి.
అక్టోబర్ 1 విడుదల చేయాలని అధికారిక ప్రకటన ఇచ్చిన రిషబ్ శెట్టి ఇప్పుడా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగానే ఉంది. ఇది దైవం పెడుతున్న పరీక్షగా భావించి కఠినమైన సవాళ్లు ఎదురుకుంటున్నాడు. హోంబాలే ఫిలిమ్స్ దీని మీద భారీ బడ్జెట్ పెడుతోంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడనంత గొప్పగా ఈ డివోషనల్ థ్రిల్లర్ ఉంటుందని అందులో పని చేస్తున్న వాళ్ళు చెబుతున్న మాట. ఈ స్పీడ్ బ్రేకులను తట్టుకుని కాంతార చాప్టర్ 1 అనుకున్న సమయానికి వస్తుందా లేదానేది ప్రస్తుతానికి సస్పెన్సే. కాంతారకు ముందు ఏం జరిగిందనే పాయింట్ మీద రిషబ్ శెట్టి దీన్ని రూపొందిస్తుండటం విశేషం.
This post was last modified on May 8, 2025 12:09 pm
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…