అసలే ఒకపక్క థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోతోంది ఏదో ఒకటి చేయమని అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు చెబుతుంటే ఇంకోపక్క ఆందోళన కలిగించే పరిణామాలు బాలీవుడ్ లో చోటు చేసుకుంటున్నాయి. రేపు రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన భూల్ ఛుక్ మాఫ్ విడుదల కావాలి. అడ్వాన్స్ బుకింగ్స్ కొద్దిరోజుల క్రితమే మొదలైపోయింది. బుక్ మై షోలో రోజుకు ఆరేడు వేల టికెట్లు అమ్ముడుపోతూ ట్రెండ్ సూచిస్తున్నాయి. స్త్రీ 2, చావా లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన మాడాక్ ఫిలింస్ నిర్మాణం కావడంతో బయ్యర్ వర్గాల నుంచి మంచి మద్దతు దక్కింది. ఇక్కడిదాకా అంతా సవ్యంగానే నడిచింది
ఇంకో ఇరవై నాలుగు గంటల్లో షోలు ప్రారంభం కావాల్సి ఉండగా టీమ్ షాక్ ఇచ్చింది. భూల్ ఛుక్ మాఫ్ థియేటర్ విడుదల రద్దు చేసి వచ్చే వారం మే 16న నేరుగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా డిస్ట్రిబ్యూషన్ వర్గాల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే థియేటర్ కేటాయింపులు, అగ్రిమెంట్లు, ముందస్తు టికెట్ల అమ్మకాలు, షోల షెడ్యూలింగ్ అంతా అయిపోయాక ఇలా హఠాత్తుగా బాంబు వేస్తే ఎలా తట్టుకుంటారు. అందులోనూ డల్లుగా ఉన్న బాక్సాఫీస్ కు రాజ్ కుమార్ రావు ఊపు తెస్తాడనే నమ్మకంతో వాళ్లంతా ఎదురు చూస్తున్న టైంలో ట్విస్ట్ ఇచ్చారు.
దేశంలో నెలకొన్న సున్నిత పరిస్థితులను కారణంగా చెప్పారు కానీ ఇప్పుడు అసలు కంటెంట్ మీద డౌట్ వస్తోంది. పాకిస్థాన్ మీద దాడుల నేపథ్యంలో కొంత ఆందోళన ఉన్న మాట వాస్తవమే కానీ మరీ దేశంలో ఏదో అలజడి రేగే స్థాయిలో అయితే కాదు. అందులోనూ ప్రభుత్వాలు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని సిద్ధంగా ఉన్నాయి. జనం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. థియేటర్లు నిక్షేపంగా నడుస్తున్నాయి. ఇప్పుడీ నిర్ణయం పట్ల ఎగ్జిబిటర్లు భగ్గుమంటున్నారు. భవిష్యత్తులో మాడాక్ సంస్థ నుంచి వచ్చే సినిమాలను బ్యాన్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారని ముంబై టాక్. టికెట్ల సొమ్ము రీఫండ్ చేసే ప్రక్రియ మొదలైపోయింది.
This post was last modified on May 8, 2025 12:01 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…