టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పోటాపోటీగా సాగుతూ.. ఆయన భారీ విజయాలందుకున్నారు. ఐతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి తర్వాతి తరం స్టార్ల హవా మొదలయ్యాక మిగతా సీనియర్ హీరోల్లాగే నాగ్ జోరు కూడా తగ్గింది. అయినా అడపాదడపా కొన్ని హిట్లు కొడుతూ ఒక దశ వరకు నాగ్ కెరీర్ బాగానే నడిచింది. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత మాత్రం నాగ్ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. పెద్ద హిట్ లేక చాలా ఏళ్లుగా సతమతం అవుతున్నాడు నాగ్. టాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ హ్యాండ్సమ్, స్టైలిష్ హీరోల్లో ఒకరైన నాగ్‌ను ఈ తరం దర్శకులు తెరపై సరిగా ప్రెజెంట్ చేయలేకపోతున్నారని.. ఆయనకు సరిపోయే కథలు రాసి సరిగ్గా సినిమాలు తీయలేకపోతున్నారనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది.
ఓవైపు బాలయ్య, వెంకటేష్ సైతం మళ్లీ కెరీర్లో పీక్స్‌ను అందుకోగా.. నాగ్ మాత్రం వెనుకబడిపోతుండడం అభిమానులకు అస్సలు రుచించడం లేదు. ఇలాంటి టైంలో నాగ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న తమిళ చిత్రం ‘కూలీ’ నుంచి నిన్న ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో రజినీకాంత్ అయినా.. గ్లింప్స్‌లో ఆయన్ని మించి హైలైట్ అయింది నాగ్ అని చెప్పాలి. ‘కూలీ’కి వంద రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని ఈ షార్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో కనీసం నాగ్ ముఖం కూడా చూపించలేదు. కానీ వెనుక నుంచి జుట్టును సవరించుకుంటున్న చిన్న షాట్‌తో అక్కినేని అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్.
ముఖం చూపించకపోయినా అది నాగ్ అని కనిపెట్టేశారు ఫ్యాన్స్. కనీసం ఫేస్ రివీల్ చేయకుండా ఇంత స్టైలిష్‌గా ఒక హీరోను ప్రెజెంట్ చేయడం, అది కూడా ఈ పని ఒక తమిళ దర్శకుడు చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి నాగ్ నటించిన ఒక సన్నివేశం లీక్ అయింది. అందులో నాగ్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. అప్పట్నుంచి ‘కూలీ’లో నాగ్ పాత్ర ఎలా ఉంటుందా అని క్యూరియస్‌గా చూస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గ్లింప్స్ చూశాక థియేటర్లలో అక్కినేని అభిమానుల సంబరాలు మామూలుగా ఉండవనిపిస్తోంది. నాగ్‌ను కెరీర్లో ఈ దశలో ఎలా చూపించాలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు లోకేష్. కూలీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 7, 2025 4:42 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…