కొన్ని సినీ సిత్రాలు విచిత్రంగా ఉంటాయి. అవి సదరు హీరోలు దర్శకులు చెప్పినప్పుడే బయటికి వస్తాయి. అలాంటిదే ఇది. ఎల్లుండి విడుదల కాబోతున్న సింగిల్ ప్రమోషన్లలో భాగంగా శ్రీవిష్ణు మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది. 2021లో రిలీజైన అర్జున ఫాల్గుణ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. ఫన్ ప్లస్ క్రైమ్ థ్రిల్లర్ గా దీని మీద రిలీజ్ కు ముందు మంచి అంచనాలు ఉండేవి. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. అయితే దీనికి ముందు అనుకున్న ఇంట్రో, క్లైమాక్స్ ఎపిసోడ్స్ వేరు. వాటిని మార్చుకున్నారు. తీరా చూస్తే అవే పెద్ద మైనస్ అయ్యాయి.
కట్ చేస్తే తొమ్మిది నెలల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది. ఊహించని విధంగా అర్జున ఫాల్గుణ కోసం ఏదైతే క్లైమాక్స్ అనుకున్నారో దాంట్లో అచ్చంగా అదే ఉంది. ఆ సినిమా సక్సెస్ లో అది చాలా కీలక పాత్ర పోషించింది. దీంతో శ్రీవిష్ణు టీమ్ షాక్ అయ్యింది. అంత క్వాలిటీగా, రిచ్ గా తాము తీయకపోయినా ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తో తాము తీసింది చాలా బాగా వచ్చిందని, కానీ తర్వాత మార్చుకోవడం దెబ్బ కొట్టిందని వివరించాడు. ఒకవేళ ఒరిజినల్ గా అనుకున్న దానికే కట్టుబడి ఉంటే ఫలితం మారేదేమో అని చెప్పుకొచ్చాడు. పేరు చెప్పలేదు కానీ శ్రీవిష్ణు చెప్పిన క్లూస్ ని బట్టి చూస్తే అది కాంతార అయ్యుండొచ్చు.
రెండు కథలు ఒకటే కాకపోయినా హీరో సరైన బాధ్యత లేకుండా బలాదూర్ గా తిరగడమనే పాయింట్ కొంచెం దగ్గరగా ఉంది. బహుశా అర్జున్ ఫాల్గుణకు తొలుత అనుకున్న ట్రీట్ మెంట్ కి ఫాంటసీ టచ్ ఉందేమో. అయినా క్లైమాక్స్ సంగతి పక్కనపెడితే ఈ సినిమాలో మిగిలిన అంశాలు కూడా ఏమంత ప్లస్ కాలేకపోయాయి. అలాంటప్పుడు ఆ చివరి ఘట్టం అలాగే ఉంచినంత మాత్రాన రిజల్ట్ మారేది కాదేమో. దీన్ని పక్కనపెడితే సింగిల్ మీద శ్రీవిష్ణు మాములు కాన్ఫిడెంట్ గా లేడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఇప్పటికే యూత్ లో అంచనాలు తెచ్చేసుకున్నాడు. టాక్ కూడా పాజిటివ్ గా వస్తే మరో హిట్టు ఖాతాలో పడ్డట్టే.
This post was last modified on May 7, 2025 2:09 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…